హీరోయిన్లను మరీ అశ్లీలంగా చూపిస్తావు.. కే రాఘవేంద్రరావు ఆఫర్ రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
సినిమా పరిశ్రమలో వచ్చిన అవకాశాలను జార విడుచుకోవడం.. అందిపుచ్చుకోవడమనే వ్యవహారం సర్వసాధారణం. అయితే ఫలానా దర్శకుడి సినిమాలో నటిస్తే.. గ్లామర్ హీరోయిన్‌గానో లేదా.. ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉంటుందనే ఆలోచనల్లో తారలు ఉంటారు. అయితే వెండితెర మీద అందాలను విరజిమ్మించే డైరెక్టర్‌గా పేరున్న ఓ ప్రముఖుడు తన సినిమాలో నటించమని కోరితే..
ఆ స్టార్ హీరోయిన్.. మాత్రం నీ చిత్రాల్లో తారలను నీచంగా చూపిస్తావని తిరస్కరించడం అప్పట్లో ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఆ స్టార్ హీరోయిన్ ఎవరు? ఆ టాప్ డైరెక్టర్ ఎవరు అనే విషయంలోకి వెళితే..
ప్రముఖ నిర్మాత కే మురారీ, స్టార్ డైరెక్టర్ కే రాఘవేంద్రరావు ఓ ఎమోషనల్ లవ్ స్టోరితో సినిమాను ప్లాన్ చేశారు. ఆ సినిమాకు కృష్ణంరాజు హీరోగా అనుకొన్నారు. ముగ్గురు హీరోయిన్లతో నడిచే కథకు శ్రీదేవీని హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అయితే మరో హీరోయిన్‌ను బాలీవుడ్ నుంచి దిగుమతి చేసుకోవాలని అనుకొన్నారు.

తమ సినిమా కోసం రాఘవేంద్రరావు, మురారీ అప్పటికే హిందీ సినీ పరిశ్రమలో టాలెంటెడ్, బ్యూటీఫుల్ యాక్టర్‌ను సంప్రదించారట. అయితే రాఘవేంద్రరావు డైరెక్టర్ అనగానే.. ఆయన హీరోయిన్లను చాలా అసభ్యంగా, అశ్లీలంగా చూపిస్తారు. ఆయన డైరెక్షన్‌లో నటించడం నాకు ఇష్టం లేదు. నా ఇమేజ్‌కు ఆయన మేకింగ్ సూట్ కాదు అని ముఖం మీదే సూటిగా చెప్పేశారట. దాంతో మరో అమ్మాయిని వెతికే పనిలో పడ్డారట.
అయితే బాలీవుడ్ హీరోయిన్ తీసుకోవాలని అనుకొన్న దర్శక, నిర్మాతలు ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకొని తమ సినిమాలో నీలి అనే పాత్ర కోసం జయసుధను ఎంపిక చేశారు. అయితే పూర్తిగా డీగ్లామర్‌గా ఉండే పాత్రలో నటించిన జయసుధకు అద్బుతమైన పేరు వచ్చింది. నటిగా ఫుల్ మార్కులు కొట్టేసింది. ఇక మూడో హీరోయిన్ పాత్ర కోసం రాధికను తీసుకోవడం తెలిసిందే.
ఇక రాఘవేంద్రరావు, నిర్మాత మురారీ రూపొందించిన ఆ సినిమా పేరు త్రిశూలం. ఆ మూవీని రిజెక్ట్ చేసిన హీరోయిన్ స్మితాపాటిల్. ఆ పాత్రను ఆమె కనుక చేసి ఉంటే.. లెక్క వేరేగా ఉండేదని సినీ అభిమానుల అభిప్రాయం. అయితే ఏది ఏమైనా స్మితా పాటిల్ లాంటి హీరోయిన్‌ను తెలుగు సినిమాల్లో ఆమె ఫ్యాన్స్ చూసే అవకాశం అలా మిస్ అయింది.

ఇదిలా ఉంటే.. రాఘవేంద్రరావు ఎంతో మందికి సినీ జన్మనిచ్చిన హీరోయిన్లలో తాప్సీ ఒకరు. ఆయన దర్శకత్వం వహించిన ఝుమ్మంది నాదం సినిమా ద్వారా సినీ ప్రవేశం చేసింది. అయితే ఇటీవల ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కే రాఘవేంద్రరావు బీఏపై దారుణంగా కామెంట్స్ చేసింది. ఓ దర్శకుడు అవసరం లేకున్నా బొడ్డుపై పండ్లు విసిరి వేస్తారు. నా కడుపుపై యాపిల్, జామకాయలు విసిరారు. అదే గుమ్మడికాయ లాంటిదైతే పరిస్థితి ఏమై ఉండేదేమో అంటూ సెటైర్లు వేశారు. ఇప్పటికీ రాఘవేంద్రరావు బీఏ అంటే.. బొడ్డు మీద యాపిల్ (BA) అని సినీ వర్గాలు అనడం.. ఆయన ఆనంద పడటం తెలిసిందే.


Click it and Unblock the Notifications











