పెళ్లి కాకుండానే శ్రీలీల ఇద్దరు పిల్లలకు తల్లి.. ఇంతకాలం ఈ సీక్రెట్ ఎందుకు దాచిందబ్బా?
పెళ్లి సందD సినిమాతో రెండేళ్ల క్రితం సినీ రంగంలో అడుగు పెట్టిన శ్రీలీల అందరికీ మోస్ట్ ఫేవరెట్ యాక్టర్ గా నిలిచిపోయింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఆ చిత్రంతోనే అందరినీ మంత్ర ముగ్ధుల్ని చేసింది. తన అందం, అభినయంతో కుర్రకారు గండెల్లో తిష్ట వేసుకొని కూర్చుంది. ప్రస్తుతం 22 ఏళ్ల వయసు కల్గిన ఈ ముద్దుగుమ్మకు పెళ్లి కాకుండా ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. అలా అని రీల్ లైఫ్ లో అనుకునేరు.. రియల్ లైఫ్ లోనే శ్రీలీలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నమ్మకశ్యం కాకపోయినా ఇది నిజమే. అయితే ఇంతకాలం ఆమె ఈ విషయాన్ని ఎందుకు దాచిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీలీల అనగానే అందరికీ గుర్తొచ్చేది అందం. ఆ తర్వాత ఆమె నటన, డ్యాన్స్. అద్భుతమైన స్టెప్పులు వేస్తూ స్టార్ హీరోల అందరి సరసన అవకాశాలను అంది పుచ్చుకుంటోందీ ముద్దుగుమ్మ. ముఖ్యంగా కుర్రకారు హాట్ ఫేవరెట్ అయిన ఈ క్యూట్ బ్యూటీ ప్రస్తుతం అనేక సినిమాల్లో నటిస్తోంది. స్టార్ హీరోల సరసన కనిపించి అందరినీ మెస్మరైజ్ చేసేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే బాలకృష్ణ, మహేష్ బాబుతో కనిపించిన ఈమె.. పవన్ కల్యాణ్, విజయ్ దేవరకొండ వంటి టాప్ లీగ్ హీరోలతో కలిసి పని చేస్తోంది.

అయితే గుంటూరు కారం సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కాగా.. ప్రస్తుతం పుల్ జోష్ లో ఉందీ క్యూట్ బ్యూటీ. ఇదంతా ఇలా ఉండగా.. ఈ ముద్దుగుమ్మకు పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లల తల్లి అయినట్లు తెలుస్తోంది. కేవలం 22 సంవత్సరాల వయసు కల్గిన ఈ క్యూట్ బ్యూటీకి... ఇద్దరు పిల్లలు ఉన్నారనే వార్త నమ్మశక్యంగానే లేదు. కానీ నిజానికి ఈమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఆ పిల్లలను ఆమె కనలేదు. కానీ పెంచుతోంది.
ముఖ్యంగా ఇద్దరు దివ్యాంగులను ఈ ముద్దుగుమ్మ దత్తత తీసుకుంది. అలా వారికి తల్లిగా మారి లాలన, పాలను చూస్తోంది. నెలల వయసు ఉన్న బాబుతో పాటు ఓ పదేళ్ల వరకూ వయసు ఉన్న బాలుడిని.. అందులోనూ దివ్యాంగులను శ్రీలీల దత్తత తీసుకుంది. వారిద్దరితో కలిసి ఆమె టైమ్ కూడా స్పెండ్ చేసింది. చిన్న బాబును అయితే తానే ఎత్తుకుని.. ఒళ్లో బజ్జో పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ పిల్లల మొహాలు సైతం మనం ఆ వీడియోలో చూడవచ్చు.

పిల్లల్ని కనకపోయినా.. అంత ప్రేమగా దగ్గరికి తీస్తున్న శ్రీలీలను చూస్తే ఎవరికైనా సరే కళ్లల్లో నీళ్లు రావడం సహజం. అంత ప్రేమగా చూసుకునే ఈ ముద్దుగుమ్మ మంచి మనసుకు ప్రేక్షకులు, అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఇలాగే నూరేళ్లు చల్లగా ఉండండి.. పది మందిని కాపాడండంటూ కామెంట్లు చేస్తున్నారు. అందంగా ఉండడమే కాదు.. అంతకు మించిన మంచి మనసు మా శ్రీలీల సొంతం అంటూ ఒక్కొక్కరూ ఒక్కో విధంగా తమ అభిమానాన్ని వెల్లడిస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ వీడియో చూసేయండి.


Click it and Unblock the Notifications











