జక్కన్న సీక్రెట్ లవ్ స్టోరీ లీక్.. 'ఛత్రపతి'లో వేణుమాధవ్ సీన్ తన రియల్ లైఫ్ కి దగ్గరగా?
ఇప్పుడు భారతీయ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఒక రేంజ్‌లో ఉండటానికి అలాగే తెలుగు సినిమా ఇండియా వైడ్ గా టాప్ లో ఉండడానికి ప్రధాన కారణం ఎవరు అంటే దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అనే చెప్పాలి. తను సినిమాని తెరకెక్కించే విధానం, హై ఎండ్ ఎమోషన్స్ తో జక్కన్నగా పేరు తెచ్చుకున్నారు. అయితే సినిమాల్లో దర్శకునిగానే కాకుండా పలు సినిమాల్లో నటునిగా కూడా తాను కనిపించిన సంగతి తెలిసిందే.
ఇది కాకుండా ఇన్నేళ్ల సినిమా జీవితంలో తనతో వర్క్ చేసే హీరోస్ ని ఏ రేంజ్ లో హింస పెడతారో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రీసెంట్ గ్లోబల్ సెన్సేషన్ RRR విషయంలో కూడా రామ్ చరణ్, ఎన్టీఆర్‌లను జక్కన్న చాలా హింస పెట్టాడు అని చెప్పుకొచ్చారు. అలాగే డార్లింగ్ ప్రభాస్ కూడా బాహుబలి సినిమా విషయంలో జక్కన్న చేసిన పనులు చెప్పి షాకిచ్చాడు.

మరి ఇలా పలువురు బిగ్ స్టార్స్ ని ఎలాంటి బెరుకు లేకుండా సాలిడ్ అవుట్ పుట్ ని రాబట్టుకున్న రాజమౌళి ఒక మంచి ఫ్యామిలీ మ్యాన్ కూడా అని అందరికీ తెలిసిందే. కుటుంబానికి జక్కన్న చాలా విలువ ఇస్తాడు. అంతెందుకు తన సినిమాకి వర్క్ చేసేవారు అంతా దాదాపు తన కుటుంబమే కనిపిస్తుంది. అలా తన లవ్ స్టోరీ గురించి కూడా తాను ఆ మధ్య తన ఓటిటి డాక్యుమెంటరీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చిన చిత్రంలో చెప్పుకొచ్చారు.
కానీ ఇది కాకుండా తనకి ఉన్న మొదటి సీక్రెట్ లవ్ స్టోరీని రాజమౌళి ఇపుడు రివీల్ చేశారు. దాదాపు ప్రతీ ఒక్కరి టీనేజ్ సమయంలో లవ్ తప్పకుండా ఉంటుంది. అలాగే జక్కన్న లైఫ్ లో కూడా ఓ లవ్ స్టోరీ ఉందట. అయితే అందులో తాను ఫెయిల్ అయ్యారని చెప్పాలి. తాను లేటెస్ట్ గా రానా టాక్ షోలో పాల్గొనగా అక్కడ రానాతో కలిసి కూర్చొని చేసిన ఇంటర్వ్యూ వైరల్ గా మారింది. ఇందులో తనకి ఇంటర్ లో ఒక లవ్ స్టోరీ ఉందని తెలిపారు.

ఇంటర్‌లో తన క్లాస్‌మేట్ అయిన ఒక అమ్మాయిని ప్రేమించాను అని రాజమౌళి తెలిపారు. అయితే తాను ప్రేమించిన విషయం తన తోటి అబ్బాయిలు ఫ్రెండ్స్ అందరికీ తెలుసు కానీ ఆమెకి మాత్రం తెలీదు అని చెప్పారు. అయితే తనని వారంతా ఆమెకి ప్రపోజ్ చేయడానికి బలవంతం చేసారని కానీ నాకు ధైర్యం చాల్లేదు అంటూ జక్కన్న అసలు విషయం చెప్పారు.
అలాగే ఆమెతో ఒకే ఒక్కసారి తాను మాట్లాడాను అని జక్కన్న చెప్పగా .. రానా ఏం మాట్లాడారు అంటూ చిన్నగా అడిగాడు. దీనికి ట్యూషన్ ఫీజ్ కట్టావా అనే ఒక్క మాట మాత్రమే చాలా కష్టంగా అడిగాను అంటూ చెప్పుకొచ్చారు. దీనితో ఈ సీన్ వింటుంటే ఛత్రపతి సినిమాలో దివంగత నటుడు వేణు మాధవ్ శ్రేయతో కొన్ని సార్లే మాట్లాడాను అంటూ సిగ్గు పడుతూ చెప్తాడు. మరి ఇదేదో తన రియల్ లైఫ్ కి కూడా సింక్ అయ్యేలా కనిపిస్తుంది అని చెప్పాలి. ఇక సినిమాలో స్టార్స్ ని వణికించే జక్కన్న సైతం ప్రేమలో మాత్రం తన భావాన్ని చెప్పేందుకు అందరిలానే ఒకడుగు వెనక్కే వేశారు అని చెప్పాలి.


Click it and Unblock the Notifications











