Leo Movie Rerelease: లియో సినిమా రీరిలీజ్.. ఇదేందయ్యా సామీ.. మొన్నే కదా వచ్చింది!

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి ఆయనకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగుతో పాటు హిందీలోనూ సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఇటీవలే ఆయన హీరోగా వచ్చిన తాజా చిత్రం లియో. అక్టోబర్ 19వ తేదీన ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అయింది. 250 కోట్ల రూపాయలతో తెరకెక్కించిన ఈ సినిమాకు టాప్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. ఐదు వారాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 600 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఈ చిత్రం మరోసారి రిలీజ్ కాబోతుంది.

నెల రోజుల క్రితమే విడుదల అయిన ఈ సినిమా మరోసారి విడుదల కావడంతో అంతా షాకై షేక్ అవుతున్నారు. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో 100 స్క్రీన్లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవలే విడుదల అయిన ఈ చిత్రం మళ్లీ ఇంత తక్కువ కాలంలోనే ఎందుకు రీరిలీజ్ అవుతుందో తెలుసుకోవాలని తెగ ఉవ్విళ్లూరుతున్నారు. అయితే సినిమా విడుదల అయినప్పటి నుంచి స్థిరంగా వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రభంజనం సృష్టించింది. 2023లో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు రాబట్టిన బ్లాక్ బస్టర్ హిట్టు చిత్రంగా కూడా లియో రికార్డు సృష్టించిది.

Do You Know The Reason For Why Rerelease The Leo Movie in Tamilnadu

బాక్సాఫీసు వద్ద ఇప్పట్లో ఈ సినిమా వసూళ్లు ఆపేలా లేదు. అలాగే థియేటర్ల వద్దరూ ఈ రేంజ్ హిట్టు, పెద్ద చిత్రలు కూడా ఏవీ రావడం లేదు. కాబట్టి వేరే చిన్న చిన్న చిత్రాలు ఈ స్థాయిలో ఆడవని.. కాబట్టి ఈ సినిమాను రీరిలీజ్ చేస్తే బాక్సాఫీసు వద్ద వసూళ్లు రాబడుతూనే ఉంటుందని చిత్రబృందం ప్లాన్ వేసింది. ఈక్రమంలోనే సూపర్ డూపర్ హిట్టుగా నిలిచిన లియో చిత్రాన్ని రీరిలీజ్ చేయబోతున్న్లు ప్రకటించింది.

Do You Know The Reason For Why Rerelease The Leo Movie in Tamilnadu

విజయ్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో ఆయనకు ప్రత్యర్థి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ నటించగా.. విజయ్ సరసన త్రిష కనిపించింది. అలాగే ఈ సినిమాలో యాక్షన్ సీన్లతో పాటు పాటలు, పైట్స్ అద్భుతంగా ఉండడంతో మూవీ సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది. దాదాపుగా 14 ఏళ్ల తర్వాత విజయ్, త్రిష జంటగా నటించిన ఈ చిత్రంలో అర్జున్ సర్జా, మన్సూర్ అలీ ఖాన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియా ఆనంద్ ప్రధాన పాత్రల్లో నచించారు. దీనికి అనిరుధ్ సంగీతాన్ని అందించాడు.

Do You Know The Reason For Why Rerelease The Leo Movie in Tamilnadu

లియో సినిమా హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడగా.. భారీ ధరలకు ఈ చిత్రం డిజిటల్, మ్యూజికల్, థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేశారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఏరియాలకు కలుపుకుని రికార్డు స్థాయిలో రూ. 215 కోట్లు బిజినెస్‌ చేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X