Bappi Lahiri ఒంటి మీద ఉన్న బంగారం ఎంతో తెలుసా? ప్రస్తుతం వాటిని ఏం చేయనున్నారంటే?

బాలీవుడ్ డిస్కో కింగ్‌గా పేరుగాంచిన సంగీత స్వరకర్త బప్పి లహరి మంగళవారం ముంబైలోని క్రిటీ కేర్ హాస్పిటల్‌లో కన్నుమూశారు. బప్పి లహరి 80-90లలో ప్రముఖ సంగీత స్వరకర్తగా గాయకుడుగా అనేక సినిమాలు చేశారు. ఆయన ఆహార్యంలో ముఖ్య భాగం ఆయన బంగారం పోషించేవి. ఎక్కువగా బంగారం ధరించి ఆయన కనిపించేవారు. ఆయన జీవిత కాలంలో ఎంత బంగారం సమకూర్చుకున్నారు? ఆ బంగారం అంతా ఇప్పుడు ఏం కానుంది ? అనే వివరాల్లోకి వెళితే

అనారోగ్యంతో

అనారోగ్యంతో

సంగీత స్వరకర్త బప్పి లహరి మంగళవారం ముంబైలోని క్రిటీ కేర్ హాస్పిటల్‌లో 69 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. దాదాపు ఒక నెలపాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా, మంగళవారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మరో సారి ఆస్పత్రిలో చేరారు. అయితే రాత్రి సమయంలో పలు అనారోగ్య సమస్యలతో ఆయన మృతి చెందారు. అయితే బప్పి లహరిని 'గోల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా' అని కూడా అంటారు. ఎప్పుడూ బరువైన బంగారు ఆభరణాలతో కనిపిస్తూ ఉండే బప్పి లహరి తనకు బంగారం అదృష్టమని భావించాడు. బప్పి లహరికి బంగారంతో పాటు కోట్ల విలువైన బంగ్లాలు, లగ్జరీ వాహనాలు కూడా ఉన్నాయి. బప్పి లహరి భారీ ఆస్తిని వదిలి వెళ్లిపోయాడు. మీడియా రిపోర్ట్ ప్రకారం, సంగీత ప్రపంచంలో మంచి పేరున్న బప్పి లహరి నికర విలువ రూ.22 కోట్లు. సినిమాల్లో మ్యూజిక్ చేసి బప్పి లహరి ఒక్కో పాటకు 8 నుంచి 10 లక్షల రూపాయలు సంపాదించేవారు. ఆయన వార్షిక సంపాదన ప్రకారం చూస్తే ఒక్కో నెలలో ఒక్కో విధంగా ఉండేవట.

 స్వయంగా శుభ్రం చేసి

స్వయంగా శుభ్రం చేసి

సంగీతంతో పాటు, బప్పి లహరికి బంగారం పై ప్రేమ ఎక్కువ. బంగారు ఆభరణాలతో ఎప్పుడూ నిండుగా కనపడే ఆయన తనకు బంగారం అదృష్టమని భావించేవాడు. తరచుగా బహిరంగ ప్రదేశాల్లో బంగారు ఆభరణాలు ధరించి కనిపించేవారు. అయితే ఆయనకు బంగారం ఎంత ఉంది అని అనుమానం కలగక మానదు. బప్పి లహరి 2014 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని సీరం నుంచి బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేశారు. ఆ సమయంలో తన అఫిడవిట్‌లో తన వద్ద ఉన్న మొత్తం బంగారం గురించిన సమాచారం ఇచ్చారు. అఫిడవిట్ ప్రకారం బప్పి లహరి వద్ద 754 గ్రాముల బంగారం ఉంది. అప్పట్లో ఈ బంగారం ధర రూ.పదిహేడున్నర లక్షలకు పైగా ఉంది. ఇక బప్పి స్నేహితుడి వివరాల ప్రకారం, బప్పి తన బంగారాన్ని చాలా భద్రంగా ఉంచేవాడు. వాటిని సేఫ్టీ కేసులో ఉంచేవారు. బప్పి స్వయంగా వాటిని శుభ్రం చేసి వేసుకునేవారు.

జాగ్రత్తగా

జాగ్రత్తగా

ఆయనకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, బంగారం తన సిగ్నేచర్ లుక్‌గా ఆయన భావించేవారు. బంగారంతో తనకంటూ ఓ ఐకానిక్ లుక్ క్రియేట్ చేసుకున్నందుకు ఆయన ఆనందంగా ఉండేవారట. ఆయన ఎక్కువగా వెస్ట్రన్ దేశాలలోని హిప్-హాప్ ద్వారా బాగా ప్రభావితమయ్యారు. ఈ క్రమంలో రాపర్‌లకు గ్లిట్జ్ మరియు వజ్రాల పట్ల ప్రత్యేక అనుబంధం ఉందని గ్రహించారు. అందుకే ఆయన వారిని ఫాలో అవుతూ బంగారం ధరించడం మొదలు పెట్టారు. బప్పి లహరికి ప్రత్యేక సహాయకుడు ఉండేవారు. కేవలం అతను బంగారాన్ని మెయింటైన్ చేయడానికే ఉండేవారట. ఇక ఆయన ఈ బంగారు ఆభరణాల అన్నింటినీ జాబితా సిద్ధం చేసి వాటిని జాగ్రత్తగా చూసుకునేవారు. నివేదికల ప్రకారం, బప్పి తన రాయల్టీ సంపాదనలో సింహభాగంతో బంగారం కొనుగోలు చేసేవారు.

నగలు ఏమవుతాయి?

నగలు ఏమవుతాయి?

బంగారంతో ఆయన సంబంధం ఆధ్యాత్మికం అని భావిస్తూ ఉండేవారు. బప్పి గోల్డ్ చైన్‌తో ఫోటోలు దిగేందుకు సినీ ప్రముఖులు, అభిమానులు పర్మిషన్ అడిగే సందర్భాలు కూడా ఉన్నాయట.
కానీ ఆయన తన ప్రత్యేక శైలిలో సున్నితంగా తిరస్కరించేవారట. 'తన ఆభరణాలను ఎవరైనా ముట్టుకోవడం ఆయనకు నచ్చదు. ఆయనను కలవడానికి లేదా ఆయన పాదాలను తాకడానికి వచ్చేవారిని కూడా బప్పి దూరంగా ఉండమని వారించేవారట. అలా బ్రతికి ఉన్నంత కాలం తాను, తన సహాయకుడు తప్ప తన బంగారాన్ని ఎవరినీ తాకనివ్వలేదు. కాబట్టి ఇప్పుడు అతని నగలు ఏమవుతాయి? అనే విషయం మీద చర్చ జరుగుతోంది.

Recommended Video

Bappi Lahiri The Disco King | India Remembers The Music Legend | Oneindia Telugu
వారసత్వ సంపదగా

వారసత్వ సంపదగా


బప్పి బంగారు గొలుసులు, లాకెట్లు, ఉంగరాలు, కంకణాలు, గణేష్ విగ్రహాలు, వజ్రాలు పొదిగిన ఆకర్షణీయమైన కంకణాలు, బంగారు ఫ్రేమ్‌లు మరియు బంగారు కఫ్‌లింక్‌లను అనేక సంవత్సరాలుగా సేకరించారు. ఈ ఆభరణాలన్నీ షో కేసులు మరియు పెట్టెల్లో ఉంచబడతాయి. వీటన్నింటినీ తాళం వేసిన అల్మారాలలో ఉండడం వల్ల ఇప్పుడు కుటుంబ వారసత్వ సంపదగా ఆ బంగారం మారింది. బప్పి కుమారుడు బప్పా మరియు కుమార్తె రీమా తమ తండ్రి బంగారాన్ని కాపాడుకోవాలని నిర్ణయించుకున్నారని కుటుంబానికి సన్నిహిత వర్గాలు తెలిపాయి. తన తండ్రి వారసత్వాన్ని ఇలాగే కొనసాగించాలని ఎప్పటి నుంచో వారు ప్లాన్ చేసుకున్నారట. అన్నట్టు స్వయంగా కొనుక్కున్నవి కాకుండా బప్పి తన అభిమానుల నుండి మరియు అతనితో పనిచేసే వారి నుండి చాలా బంగారు బహుమతులు అందుకున్నారు. ఇవన్నీ ఇప్పుడు వారసత్వ సంపదగా భద్రపరచబడతాయని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X