శంకర్‌తో సినిమాలు మిస్ చేసుకున్న తెలుగు హీరోలు ఎవరో తెలుసా?
ఖచ్చితంగా కొందరు హీరోలు లేదా నటులు ఈ దర్శకుని దగ్గర తప్పకుండా వర్క్ చెయ్యాలి అని అనుకుంటారు. ఆయన భారతదేశం గర్వించదగ్గ దర్శక దిగ్గజం ఎస్ శంకర్. ఇప్పుడంటే పాన్ ఇండియా సినిమాలు, విజువల్ ఎఫెక్ట్స్‌తో సినిమాలు వస్తున్నాయి. కానీ ఆయన ఎప్పుడో ఇండియన్ సినిమా స్థాయిని ఇంటర్నేషనల్ లెవెల్లో నిలబెట్టారని అందరికీ తెలిసిందే
కాగా తన ఫిల్మోగ్రఫీ చూస్తే డెఫినెట్ గా తన ఫ్యాన్ అవుతారు ఎవరైనా. సమాజానికి ఇచ్చే సందేశంలో కానీ.. తాను ఎంచుకునే కాన్సెప్ట్ లు కానీ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంటాయి. అందుకే శంకర్ సినిమాలు అంటే చాలా మందికి మంచి క్రేజ్. అలానే శంకర్ ఇపుడు వరకు చేసిన సినిమాల్లో గ్రాఫిక్స్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలా శంకర్ లాంటి దర్శకునితో సినిమా అంటే తప్పకుండా ఏ హీరో అయినా ముందుంటాడు.

కానీ శంకర్ ఇన్నేళ్ల కెరీర్లో తెలుగులో మాత్రం ఒక్కే ఒక్క సినిమా అది కూడా ఇపుడు 2025 లో రాబోతున్న గేమ్ చేంజర్ చేశారు. మరి ఇన్నేళ్ల కెరీర్ లో శంకర్ తో సినిమాలు చేయాలని తెలుగు టాప్ హీరోస్ అనుకున్నారట. నిజానికి శంకర్ ఎప్పుడు నుంచో చెబుతూ ఉంటారు.. తాను మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలి అని. కానీ అది అప్పట్లో కుదరలేదు కానీ ఇపుడు తన నట వారసుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో పూర్తయ్యిందని .
కానీ ఇపుడు ఓ ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే శంకర్ తో చాలా మంది తెలుగు హీరోలు వర్క్ చేయాల్సి ఉంది కానీ అవన్నీ మిస్ అయ్యాయట. కోవిడ్ సమయంలోనే పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో సినిమా చేయాలనీ శంకర్ అనుకున్నారట కానీ అది కుదరలేదు. అది కాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేయాలి అనుకుంటే అదీ అవ్వలేదు అట.

అలా ఫైనల్ గా రామ్ చరణ్ తో తెలుగులో తన తొలి సినిమా సెట్ అయ్యింది అని శంకర్ చెప్పుకొచ్చారు. ఏమో రామ్ చరణ్ తోనే సినిమా చేయాలని ఉంది కాబట్టే తమ సినిమా ఓకే అయిందేమో అని తెలిపారు. నిజానికి గేమ్ ఛేంజర్ సినిమాకి కూడా మొదట పవన్ కళ్యాణ్ తో చేద్దామని శంకర్ అనుకున్నారట. కానీ దిల్ రాజు చరణ్ పేరుని సిఫారసు చేశారట.
ఇలా తెలుగులో అయితే శంకర్ తో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, పాన్ ఇండియా హీరో ప్రభాస్ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద తారల తోనే సినిమాలు పడాల్సింది. కానీ అవన్నీ మిస్ అయ్యాయి అని చెప్పాలి. అయితే ఎట్టకేలకి రామ్ చరణ్ ద్వారా తెలుగులో సినిమా చేసే అవకాశం శంకర్‌కి వచ్చింది.


Click it and Unblock the Notifications











