Klin Kaara: 'క్లింకార'ను చరణ్, ఉపాసన ముద్దుగా ఏమని పిలుస్తారో తెలుసా? ఎవరు పెట్టారంటే?

రామ్ చరణ్​, ఉపాసనల ముద్దుల కూతురు, మెగాస్టార్ చిరంజీవి ముద్దుల మనవరాలు క్లింకార. మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్​ ఈ బుడదాన్ని ఎంతో ప్రేమగా అల్లారు ముద్దుగా చూసుకుంటారు. ఎందుకంటే రామ్​ చరణ్​ - ఉపాసనకు దాదాపు పెళ్లై పదేళ్ల తర్వాత కలిగిన సంతానం. అందుకే ఈ పాప అంటే ప్రతిఒక్కరికీ వెరీ స్పెషల్. ​

ఎప్పుడు రివీల్ చేస్తారో : అయితే ఇప్పటి వరకు క్లీంకారను అస్సలు బయటకు చూపించలేదు మెగా ఫ్యామిలీ. ఆమె ఫొటోస్​ పోస్ట్ చేసినప్పటికీ తన ముఖం కనిపించకుండా లవ్​ ఎమోజీలతో కవర్ చేస్తున్నారు. దీంతో మెగా అభిమానులంతా ఎప్పుడెప్పుడు క్లీంకార ఫేస్​ను రివీల్ చేస్తారా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Do you know what is Ram Charan Upasana Daughter Klinkaara Nick Name?

లక్షన్నర ఇచ్చి కేర్​ టేకర్​ను : రీసెంట్​గా ఈ పాపను జాగ్రత్తగా చూసుకునే బాధ్యతను కూడా సావిత్రి అనే కేర్ టేక్​రు అప్పగించారు. ఎందుకుంటే ఇంతకాలం చరణ్​-ఉపాసన తమ బిడ్డ కోసమే సమయాన్ని కేటాయించారు. ఇప్పుడు తమ ప్రొఫెషనల్​ లైఫ్​తో బిజీ అవుతున్నారు. అందుకే క్లీంకార కోసం కేర్​ టేకర్​ను నియమించారు. అంతే కాదు ఆమెకు లక్షన్నర జీతం కూడా చెల్లిస్తున్నారు. ఈ విషయం అయితే నెట్టింట్లో ఫుల్ హాట్​టాపిక్ అయింది.

అంతా అదృష్టమే : క్లింకార పుట్టినప్పటి నుంచి మెగా ఫ్యామిలీకి బాగా కలిసొస్తుంది. రామ్ చరణ్​కు ఆర్ఆర్ఆర్​తో వరల్డ్ వైడ్​ క్రేజ్​, పలు అవార్డులు, హాలీవుడ్​ టాప్​ డైరెక్టర్స్​ జేమ్స్ కామరూన్ లాంటి వారు చరణ్​ యాక్టింగ్​పై ప్రశంసలు కురిపించడం, అల్లు అర్జున్​కు నేషనల్ అవార్డ్ వరించడం, మెగాస్టార్​కు పద్మ విభూషన్ రావడం వంటి ఎన్నో జరిగాయి. దీంతో క్లింకార అడుగు పెట్టిన వేళా విశేషం అంటూ అందరూ కామెంట్లు చేస్తున్నారు.

Do you know what is Ram Charan Upasana Daughter Klinkaara Nick Name?

ఇప్పుడు తాజాగా క్లింకారాకు సంబంధించి మరో వార్త వచ్చింది. అదేంటంటే మెగా ఫ్యామిలీ ఈ పాపకు పెట్టిన నిక్ నేమ్. రీసెంట్ ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ క్లింకారను కారా అని పిలుస్తామని రివీల్ చేసింది. ఈ పేరు రామ్​చరణ్ పెట్టినట్లు బయట కథనాలు వస్తున్నాయి. దీంతో మెగా ఫ్యామిలీ మొత్తం కూడా ఇదే నిక్ నేమ్​తో పిలుస్తారని తెలుస్తోంది. మరో ఆసక్తికర విషయాన్ని కూడా చెప్పారు ఉపాసన. క్లింకార నాన్న కూచీ అని చెప్పుకొచ్చారు. రామ్ చరణ్​ను చూడగనే పాపా బాగా నవ్వుతుందని, వారిద్దరి బాగాఎమోషనల్ కనెక్షన్ ఏర్పడిందని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X