అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్‌కు పబ్లిక్ ఇచ్చిన రేటింగ్ ఎంత, తొలిరోజు ఎంత మంది చూశారంటే?
కలర్ ఫొటో ఫేమ్ హీరో సుహాస్ గురించి అందరికీ తెలిసిందే. అద్భుతమైన కథలతో వస్తూ.. సూపర్ డూపర్ హిట్లు కొడుతున్న ఈ కుర్ర హీరో తాజా సినిమా అంబాజీపేట మ్యారేజి బ్యాండ్. దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శివానీ నగరం హీరోయిన్‌గా నటించగా.. ఫిబ్రవరి 2వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాకు మంచి టాక్ వస్తోంది.
అంతా సినిమా చాలా బాగుందని చెబుతున్నారు. కచ్చితంగా సూపర్ హిట్ గా నిలుస్తుందని చాలా మంది చెబుతుండగా.. బుక్ మై షో, పేటీఎం, ఐఎండీబీ వంటి వాటిల్లో అసలు పబ్లిక్ ఏ రేటింగ్ ఇచ్చారు, తొలి రోజు ఈ సినిమాను ఎంత మంది చూశారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సుహాస్ హీరోగా వచ్చిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సినిమాను వెంకటేశ్ మహా సమర్పణలో గీతా ఆర్ట్స్ 2, మహాయణ మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ధీరజ్ మోగిలినేని నిర్మించారు. అలాగే సుహాస్, శివానీలతో పాటు జగదీష్ ప్రతాప్ బండారి, గోపరాజు రమణ, శరణ్య ప్రదీప్ లు ప్రధాన పాత్రల్లో నటించారు.
భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 2వ తేదీన విడుదల అయిన ఈ చిత్రానికి ఫస్ట్ షో నుంచే డీసెంట్ టాక్ వస్తోంది. బుక్ మై షో వేధికగా సినీ ప్రియులు ఈ సినిమాకు 9.2 రేటింగ్ ఇచ్చారు. అలాగే పేటీఎంలో కూడా 92 శాతం రేటింగ్ ఇచ్చారు. ఇక ఐఎండీబీలో 9.0 రేటింగ్ ఇచ్చి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. కేవలం ది మాత్రమే కాకుండా సినిమా చూసిన వాళ్లంతా చాలా బాగుందంటూ మౌత్ పబ్లిసిటీ ఇస్తున్నారు.

ఇలా అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమా చూసే వాళ్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా తొలిరోజే ఒక్క బుక్ మై షోలో టికెట్లు బుక్ చేసుకుని చూసిన వారి సంఖ్య 30 వేలు కావడం గమనార్హం. ఇక వారాంతంలో కూడా ఈ సినిమాను మరింత మంది చూస్తారని.. కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. చూడాలి మరి సుహాస్.. అంజాబీపేట మ్యారేజీ బ్యాండు.. బాక్సాఫీసు వద్ద ఏ రేంజ్ లో సౌండ్ చేస్తుందనేది.


Click it and Unblock the Notifications











