Chandra Mohan Death: చంద్రమోహన్ అంత్యక్రియలు ఆలస్యం.. కారణం ఏమిటంటే?
చంద్రమోహన్ అంత్యక్రియలు: సీనియర్ నటుడు, హీరో చంద్రమోహన్ ఈరోజు హృద్రోగ సమ్యసతో కన్నుమూశారు. 82 ఏళ్ల వయసు కల్గిన ఆయన కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరారు. ఈరోజు ఉదయం 9.45 నిమిషాలకు ప్రాణాలు కోల్పోయారు. చంద్రమోహన్ మృతితో టాలీవుడ్ మొత్తం విషాధ ఛాయలు అలముకున్నాయి. ఆయనను చివరసారిగా చూసేందుకు పెద్ద ఎత్తున జనాలు, సినీ ప్రముఖులు వెళ్తున్నారు. ఇదంతా ఇలా ఉండగా.. ఇప్పటికే ఈయన అంత్యక్రియల ఎప్పుడు నిర్వహిస్తారనేది అధికారికంగా ప్రకటించారు.
సోమవారం రోజు చంద్రమోహన్ అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్లు ఇప్పటికే చెప్పారు. అయితే శనివారం రోజు ఉదయం చనిపోయిన ఆయనకు సోమవారం రోజు అంటే మూడ్రోజులకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఇలా రెండు రోజుల పాటు ఆయన అంత్యక్రియలు ఆలస్యంగా ఎందుకు నిర్వహిస్తున్నారని చాలా మందికి అనుమానం వస్తోంది. అయితే ఇలా ఆలస్యంగా చేయడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

చంద్రమోహన్ భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే పెద్ద కుమార్తె పేరు మధుర మీనాక్షి. ఈమె ఓ సైకాలజిస్టుగా పని చేస్తున్నారు. అలాగే చిన్న కుమార్తె మాధవి చెన్నైలో సెటిల్ అయ్యారు. పెద్ద కూతురు మధుర మీనాక్షి మాత్రం ప్రస్తుతం ఈమె అమెరికాలో ఉంటున్నారు. అయితే ఆవిడ తండ్రి అంత్యక్రియల కోసం రావడానికి కాస్త సమయం పడుతుంది. కాబట్టి రెండు రోజులు ఆలస్యంగా ఈయన అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక్కటి మాత్రమే కాదండోయ్.. మరో కారణం కూడా ఉంది.
ఆదివారం రోజే దీపావళి పండగు ఉండడం.. ఒక్క రోజు ముందే చంద్రమోహన్ చనిపోవడం నిజంగా బాధాకరమే. పండుగ వదిలిపెట్టుకొని అంత్యక్రియలకు వెళ్లేందుకు ఎవరూ ఎక్కువగా ఇష్టపడరు. అందులోనూ చాలా దగ్గరి వాళ్లు, ఇక తప్పదు అనుకున్న వాళ్లు మాత్రమే వెళ్లే ఛాన్స్ ఉంటుంది. దీని వల్ల చాలా మంది అభిమానులు కూడా ఆయనను కడసారి చూసేందుకు రాలేరని భావించి అంత్యక్రియలు సోమవారం నిర్వహించాలని భావించారట. పండుగ తర్వాతి రోజు అయితే చూడాలనుకున్న వాళ్లంతా ఈజీగా వచ్చేస్తారు. ఇలా ఈ రెండు కారణాలతో చంద్రమోహన్ అంత్యక్రియలను సోమవారం రోజు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ పట్టణంలోనే చంద్రమోహన్ అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఫిల్మ నగర్ లోని మహా ప్రస్థానంలో ఆయనకు కడసారి వీడ్కోలు పలికే అవకాశం ఉన్నట్లు సమాచారం. సోమవారం రోజు ఉదయమే ఆయనకు దహన సంస్కారాలు నిర్వహిస్తారని తెలుస్తోంది. అలాగే చంద్రమోహన్ అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని ఆదివారం లేదా సోమవారం ఉదయం ఫిల్మ్ ఛాంబర్ కు తీసుకు వస్తారని అంతా అనుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











