Jagapati Babu: "సినిమాల్లోకి రాకపోతే ఆ పని చేస్తూ.. అందరినీ గడగడలాడించేవాడిని"

టాలీవుడ్ సీనియర్ టాప్ హీరో జగపతి బాబు గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం హీరోగానే కాకుండా విలన్ గా కూడా టాలీవుడ్ ను ఏలేస్తున్న ఈయన తాజాగా ఓ ట్వీట్ చేశారు. ముఖ్యంగా తాను సినిమాల్లోకి రాకపోయి ఉంటే ఆ ఉద్యోగం చేసేవాడిని అని.. అందరినీ గడగడలాడించే వాడినని చెప్పుకొచ్చాడు. పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేయండి.

జగపతి బాబు సూపర్ డూపర్ హిట్టు చిత్రాలతో నడుస్తూ... దాదాపు 100కు పైగా చిత్రాల్లో నటించారు. తన అద్భుతమైన టననను చూపించి ఏడు నంది పురస్కారాలను అందుకున్నారు. ప్రస్తుతం విలన్ గా కూడా ఇరగదీస్తూ.. సూపర్ ఆర్టిస్ట్ గా దూసుకెళ్తున్న ఈయనకు ఇప్పటికీ పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. గాయం, అంతఃపురం, ప్రవరాఖ్యుడు, లెజెండ్, రంగస్థలం, శ్రీమంతుడు వంటి సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించిన ఈయన చాలా బిజీగా ఉంటారు.

Do you know what job Jagapathi Babu would have done if he had not entered films

ఓవైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటారు. అలాగే తనకు సంబంధించిన ట్రెండీ ట్రెండీ లుక్ కు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటారు.

తాజాగా జగ్గుబాయ్ మరో పోస్ట్ చేశారు. ఎక్స్ వేధికగా తన ఫొటోతో పాటు ఓ విషయాన్ని కూడా వెల్లడించారు. ఆయన సినిమాల్లోకి రాకపోయి ఉంటే కచ్చితంగా సూపర్ కాప్ అయ్యేవాడిని అని వివరించాడు. ఇప్పుడున్న సూపర్ కాప్ లలాగా లా అండ్ ఆర్డర్ ని గడగడలాడించేవాడిని ఏం అంటారని అడిగారు. అలాగే తాను ఓ పోలీస్ ఆఫీసర్ డ్రెస్ లో తెగ స్టైలిష్ గా కనిపించారు. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని యమా క్రేజీగా ఉన్నారు.

Do you know what job Jagapathi Babu would have done if he had not entered films

అయితే ఈ ఫొటో రుస్లాన్ అనే సినిమా లుక్ లాగా తెలుస్తోంది. ఈ సినిమా ఏప్రి 24వ తేదీన విడుదల కాబోతున్నట్లు వివరించారు. ఈ సినిమాలో జగపతి బాబు పోలీస్ ఆఫీసర్ గా దర్శనం ఇస్తుండగా.. యాక్షన్ థ్రిల్లర్ గా తెలకెక్కనుంది. ఆయుష్ శర్మ, విద్య మల్వాడే, జగపతి బాబు, భక్తి క్లీన్ వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో కనిపిస్తుండగా.. కరణ్ భుటాని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ రుస్లాన్ అనే సినిమాను ఏప్రిల్ 26వ తేదీన థియేటర్లలో చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి. ముఖ్యంగా జగపతి బాబు ఏ రేంజ్ లో యాక్టింగ్ చేశారో కూడా గమనించేసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X