Rinku Singh సిక్సర్ల మోత మోగించిన రింకూ సింగ్‌కు భారీ బహుమతి.. షారుక్ ఖాన్ ఇచ్చిన గిఫ్టు ఏమిటో తెలుసా?

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్‌కు చెందిన కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టు ఐపీఎల్ టోర్నమెంట్‌లో దాదాపు అసాధ్యం అనుకొన్న లక్ష్యాన్ని సుసాధ్యం చేసింది. దాదాపు గెలుపు ఖరారు అనుకున్న గుజరాత్ టైటాన్స్ జట్టును ఓటమి పాలు చేసింది. KKR జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించిన క్రికెటర్‌ రింకూ సింగ్‌ను జట్టు యజమాని షారుక్ ఖాన్ ప్రశంసల్లో ముంచెత్తారు. అంతేకాకుండా భారీ నజరానా కూడా కూడా ప్రకటించడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. రింకూ సింగ్‌కు ఇచ్చిన ఖరీదైన బహుమానం ఏమిటంటే?

రింకూ సింగ్ సిక్సర్ల వర్షం: ఆదివారం గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఐపీఎల్ ట్వెంటీ20 మ్యాచ్ హోరాహోరీగా జరిగింది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు చివరి ఓవర్‌లో 29 పరుగులు చేయాల్సి ఉంది. అయితే బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్ చివరి ఐదు బంతులను 5 సిక్సర్లుగా మలిచాడు. దాంతో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు విజయాన్ని సొంతం చేసుకొన్నది. రింకూ సింగ్ కేవలం 21 బంతుల్లో పరుగులు చేశాడు. జట్టులో వెంకటేష్ అయ్యర్, నితీష్ రానా కూడా బాధ్యతాయుతమైన ఇన్సింగ్స్‌ను ఆడారు.

Do You Know What Shah Rukh Khan gifted to KKR Cricketer Rinku Singh after winning on Gujarat Titans in IPL?

విజయం మా పక్షాన అంటూ : కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టును విజయపథంలో నడిపించిన రింకూ సింగ్ మాట్లాడుతూ.. గెలుపు సాధిస్తామన్న నమ్మకం నన్ను వెంటాడింది. కెప్టెన్ నితీష్ రానా నాతో మాట్లాడుతూ.. చివరి బంతి వరకు క్రీజులో ఉండేలా ఆడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో వేచి చూద్దామని భరోసా ఇచ్చాడు. కెప్టెన్ సలహాను పాటిస్తూ బంతిని బౌండరీ దాటించే ప్రయత్నం చేశాను. విజయం మా పక్షాన నిలిచింది అని రింకూ సింగ్ చెప్పాడు.

షారుక్ ఖాన్ ట్వీట్: కోల్‌కతా నైట్ రైడర్స్‌ను విజయం వైపు నడిపించిన వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, నితీష్ రానాను ప్రశంసలతో ముంచెత్తాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే షారుక్ ఖాన్ ట్వీట్ చేస్తూ.. పఠాన్ సినిమాలోనే జూమే జో పఠాన్ పాటను అనుకరిస్తూ.. జూమే జో రింకూ అంటూ మై బేబీ.. యూ బ్యూటీస్ రింకూ సింగ్, నితిష్ రానా, వెంకటేష్ అయ్యర్ .. కంగ్రాట్స్.. నమ్మకం వమ్ము కానివ్వలేదు అని షారుక్ ఖాన్ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

Do You Know What Shah Rukh Khan gifted to KKR Cricketer Rinku Singh after winning on Gujarat Titans in IPL?

ఖరీదైన కారును బహుమతిగా : కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించిన రింకూ సింగ్‌ను ప్రశంసలకే పరిమితం కానివ్వలేదు. అయితే భారీ నజరానాను షారుక్ అందిజేసినట్టు సమాచారం. జట్టును గెలిపించిన రింకూకు షారుక్ ఖాన్ ఖరీదైన, విలాసవంతమైన కారును బహుమతిగా ఇచ్చారు.రింకూకు మెర్సిడెజ్ బెంజ్ కానును గిఫ్టుగా అందజేశారనే విషయం తెలిసింది.

షారుక్ ఖాన్ విజయాల పరంపర: ఇక షారుక్ ఖాన్ అటు సినిమా రంగంలోను, ఇటు క్రికెట్ రంగంలోను వరుస విజయాలను అందుకొంటున్నారు. ఆయన నటించిన పఠాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టిన విషయం తెలిసిందే. అలాగే ఐపీఎల్‌లో తన జట్టు వరుస విజయాలు సాధించడంతో మంచి జోష్‌లో కనిపిస్తున్నాడు. తమ జట్టు ఆడుతుండగా.. స్వయంగా స్డేడియానికి కుటుంబ సభ్యులతో వచ్చి ప్రోత్సాహం అందజేస్తున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X