Vishwambhara: Mega 156 నుంచి లేటెస్ట్ అప్‌డేట్ లీక్.. మేజర్ పార్ట్ షూటింగ్ అంతా అక్కడేనట!
మెగాస్టార్ చిరంజీవి గురించి ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేంకగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరు విన్నా, ఆయన సినిమా వస్తుందని తెలిసినా ఆయన ఫ్యాన్స్ అంతా పూనకాలతో ఊగిపోతుంటారు. ముఖ్యంగా చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటి నుంచి మరింత ఎగ్జైట్ అవుతూ.. పుల్ రచ్చ చేస్తున్నారు. తాజాగా ఆయన విశ్వంభర సినిమా తీబోయబోతున్నట్లు ప్రకటించినప్పటి నుంచి అందరి కన్ను ఆ సినిమాపైనే పడింది. అయితే ఈ సినిమా నుంచి ఓ అద్భుతమైన అప్ డేట్ లీక్ అయింది. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
చిరుంజీవి చివరగా తీసిన భోళా శంకర్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో.. నెక్స్ట్ సినిమాతోనైనా సరే కచ్చితంగా హిట్టు కొట్టాలని భావిస్తున్నారు. ఆ కసితోనే విశ్వంభర సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆచితూచి అడుగులు వేస్తూ.. సినిమా సక్సెస్ దిశగా వెళ్తున్నారు. 2023 అక్టోబర్ నెలలోనే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్నారు. యువి క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

విశ్వంభర సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా.. చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ బాధ్యతలు చూసుకోబోతున్నారు. అలాగే డైలాగ్స్ ను సాయి మాధవ్ బుర్రా రాయనున్నారు. కాస్ట్యూమ్ డిజైనర్ గా చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల వ్యవహరించనున్నారు. ఇక మల్లిడి వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. ఇదంతా ఇలా ఉండగా.. ఇప్పుడిప్పుడే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే ఈ సినిమా షూటింగ్ కోసం స్పెషల్ సెట్లు కూడా వేయించబోతున్నారట. ముఖ్యంగా హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో మొత్తం 13 భారీ సెట్లు వేసి మరీ విశ్వంభర సినిమా మేజర్ షూటింగ్ పార్ట్ ను పూర్తి చేస్తారట. ఎక్కువ శాతం సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లోనే పూర్తి కానుంది. అలాగే ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా చేయబోతుంది. ఈమే కాకుండా మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఉండబోతున్నట్లు టాక్ నడుస్తోంది.
200 కోట్ల రూపాయల బారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా మూడు లోకాల చుట్టూ తిరిగే కథ అని తెలుస్తోంది. దేవ, మానవ, పాతాళ లోకాల్లో ఓ పాప చుట్టూ ఈ సినిమా ఉంటుందట. సోషియో ఫాంటసీగా రాబోతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తామని ఇప్పటికే చిత్రబృందం వెల్లడించింది. చూడాలి మరి షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది.


Click it and Unblock the Notifications











