Allu Arjun: అల్లు అర్జున్ దేశముదురు లుక్‌లో స్టార్ డైరెక్టర్.. ఎవరో గుర్తు పట్టారా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి, ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన టాలెంట్ కల్గిన ఈయన అదిరిపోయే సినిమాలు తీస్తూ.. దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. బాలనటుడిగా సినీ రంగంలో అడుగు పెట్టటిన ఈయన గంగోత్రి సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత నుంచి వరుసగా సినిమాలు చేస్తూ.. తన క్రేజ్ ను మరింతగా పెంచుకున్నాడు.
అయితే అల్లు అర్జున్ హీరోగా చేసిన దేశముదురు సినిమా లుక్ లో ఓ స్టార్ డైరెక్టర్ కనిపించారు. అచ్చం అల్లు అర్జున్ లాగే తయారైన అదరగొట్టారు. ప్రస్తుతం ఆ స్టార్ డైరెక్టర్ దేశముదురు లుక్ లో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరి అల్లు అర్జున్ ను ఫాలో అయిన ఆ క్రేజీ దర్శకుడు ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అల్లు అర్జున్ హీరోగా చేసిన ఆయన ఐదవ సినిమానే దేశముదురు. 2007లో వచ్చిన ఈ సినిమాకు పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించగా... అల్లు అర్జున్ సరసన హన్సిక హీరోయిన్ గా నటించింది. ప్రదీప్ రావత్, ఆలీ, జీవా, సుబ్బరాజు, అజయ్, రఘుబాబు, రాజా రవీంద్ర, శ్రీనివాస్ రెడ్డి, రాజేష్, వంశీ, రమాప్రభ, కోవై సరళ, తెలంగాణ శకుంతల వంటి వాళ్లంతా అద్భుతమైన పాత్రల్లో నటించి మెప్పించారు.

2007 జనవరి 12వ తేదీన విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాకు ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. మట్టండి.. ఇదంటా మట్టి అంటూ హన్సిక తన శరీరం గురించి చెప్పిన డైలాగ్, కోవై సరన.. ఆవకాయ గురించి వివరించిన డైలాగ్ లను అయితే అస్సలే మర్చిపోలేము. ఇలా అదిరిపోయే కాన్సెప్ట్ తో వచ్చి సెన్సేషన్ క్రియేట్ ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు.
ఈ సినిమా విడుదల అయిన తర్వాత చాలా మంది కుర్రకారు ఈయన స్టైల్ ను ఫాలో అయ్యారు. ఈ కోవలోకే వచ్చాడో స్టార్ డైరెక్టర్. "హిట్" సినిమాల డైరెక్టర్ శైలేష్ కొలనుకు దేశ ముదురు సినిమా వచ్చిన సమయంలో కేవలం 20 సంవత్సరాలు మాత్రమే. 25 ఏళ్ల వయసులో అల్లు అర్జున్ చేసిన ఈ సినిమా లుక్ ను 20 ఏళ్ల వయసు కల్గిన శైలేష్ కొలను రీక్రియేట్ చేశాడు. అచ్చం అల్లు అర్జున్ ధరించిన డెనిమ్ జాకెట్ సహా.. జీన్స్ వేసుకుని.. మెడలో ఉన్న స్టైలిష్ లాకెట్ ను నోట్లో పెట్టుకుని ఫొటో దిగాడు.
ముఖ్యంగా అల్లు అర్జున్ దేశముదురు సినిమా పోస్టర్ పక్కనే నిల్చుని.. యమా స్టైలిష్ గా కనిపిస్తూ సందడి చేశాడు డైరెక్టర్ శైలేష్ కొలను. ప్రస్తుతం ఆయన సోషల్ మీడియా వేదికగా ఈ ఫొటోలు షేర్ చేయగా నెట్టింట వైరల్ అయ్యాయి. మీరు కూడా ఓ సారి ఈ స్టార్ డైరెక్టర్ దేశముదురు లుక్ చూసేయండి.


Click it and Unblock the Notifications











