పవన్ కల్యాణ్ కోసం 600 కి.మీ నడుచుకుంటూ వెళ్లిన డైరెక్టర్.. ఎవరు, ఎందుకో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగానే కాకుండా.. ఆయనను పర్సనల్ గా ఇష్టపడే వాళ్ల సంఖ్య లక్షల్లోనే ఉంది. అయితే ఈయన కోసం ఎంతో మంది ఎన్నెన్నో త్యాగాలు చేస్తుంటారు. ఆయన పేరు చెబితేనే అనేక మంది సాయం చేసేందుకు ముందుకు వస్తుంటారు. అయితే ఓ స్టార్ డైరెక్టర్.. జనసేనాని పవన్ కల్యాణ్ కోసం 600 కిలో మీటర్ల పాదయాత్ర చేసి అందరికీ షాక్ ఇచ్చారు. అయితే ఈ పాదయాత్ర చేసిన డైరెక్టర్ ఎవరు, ఎందుకు చేశారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు హీరోగా ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అయితే ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో రాణించాలని చూస్తున్న ఈయన తాజాగా.. పిఠాపురం నుంచి ఏపీ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే గతంలో కూడా ఎన్నికల్లో పాల్గొని ఓడిపోయిన ఈయన.. ఈసారి మాత్రం కచ్చితంగా గెలుస్తారని.. ఆయన అభిమానులు అనుకుంటున్నారు. ఇదంతా ఇలా ఉండగా.. పవన్ స్టార్ పవన్ కల్యాణ్ కోసం డైరెక్టర్ శ్రీ వాత్సవ్ 600 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు కాలి నడకన వెళ్లారు.

అయితే పవన్ కల్యాణ్ కోసం ఇంతలా ఎందుకు చేశారని.. అసలు ఏం కావాలని కోరుకుని పాదయాత్ర చేశారని ఆయనను అడగ్గా... అనేక విషయాలు చెప్పారు. గతంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఎన్నికల కమిషన్ గాజు గ్లాసు గుర్తును కేటాయించగా.. విజయసాయి రెడ్డి ఫిర్యాదు మేరకు దాన్ని తీసేశారని గుర్తు చేశారు. ఆ సమయంలో తన స్నేహితులు అంతా పవన్ కల్యాణ్ గెలవడం చాలా కష్టం అంటూ కామెంట్లు చేశారని.. అది తనను చాలా బాధించిందని చెప్పుకొచ్చారు. జనసేనకు ఒక్క సీట్ కూడా రాదంటూ ఎద్దేవా చేశారని.. దాంతో నాలుగైదు రోజులు తనకు నిద్ర కూడా పట్టలేదని డైరెక్టర్ శ్రీ వాత్సవ్ వెల్లడించారు. అయితే తనకు గోవింద మాల వేసుకోవాలని అనిపించిందని.. హైదరాబాద్ నుంచి తిరుపతికి కాలి నడకను వెళ్తానని చెప్పినట్లు స్పష్టం చేశారు.
కానీ పాదయాత్రను వద్దని ఓ స్వామీజీ చెప్పారని.. 21 రోజులు మాల వేసుకుని నేరుగా వెళ్లి దర్శనం చేసుకోమని అన్నట్లు చెప్పుకొచ్చారు. కానీ తాను కుదరది చెప్పగా.. సరేనని ఇరుముడి కట్టారట. పవన్ కల్యాణ్ కోసం.. ముఖ్యంగా జనసేన పార్టీకీ గాజు గ్లాసు ఇరుముడిలో కట్టినట్లు వివరించారు. గాజు అయితే పగులుతుందని.. ఒకటి వెండిది, మరోటి ఇత్తడిది చేయించి తీసుకెళ్లానని స్పష్టం చేశారు. మొత్తం 18 రోజుల పాటు తన పాదయాత్ర సాగిందని.. మాలలో ఉండడం వల్ల కేవలం పండ్లు మాత్రమే తిని వెళ్లినట్లు చెప్పుకొచ్చారు.

ఇంట్లో వాళ్లు కూడా చాలా భయపడిపోయి.. డ్రై ఫ్రూట్స్ పెట్టి పంపించారని.. అడవిలో ఓచోట కోతుల మంద రాగా అవన్నీ వాటికి వేసి ఏమీ లేకుండా తాను నడకన వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. అయితే తాను ఎక్కడ నిద్ర చేసినా.. రామాలయం లేదంటే ఆంజనేయ స్వామి గుడిలోనే నిద్ర చేశానని.. ఆ స్వామి వారే తనను తీసుకు వెళ్లినట్లు పేర్కొన్నారు. ఇలా పవన్ కల్యాణ్ కోసం ఇష్టంగా వెళ్లిన కాలి నడక విజయవంతం అయిందని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. మీరు కూడా ఓసారి చూసేయండి.


Click it and Unblock the Notifications











