సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సంక్రాంతి సినిమాలు.. ఏ చిత్రానికి ఎక్కువ టికెట్లు అమ్ముడు పోయాయో తెలుసా?
సంక్రాంతి పండుగ సందర్భంగా అనేక సినిమాలు విడుదల కాబోతున్నాయి. ముఖ్యంగా పెద్ద పెద్ద సినిమాలు 8 అందుబాటులోకి వచ్చాయి. తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కలుపుకుని మూడు రోజుల పాటు మొత్తం పెద్ద పెద్ద హీరోల ఎనిమిది సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు ఈ రోజే విడుదల కాగా.. మరికొన్ని చిత్రాలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే అడ్వాన్స్ గా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉండడంతో బుక్ మై షోలో అనేక మంది తమకు నచ్చిన సినిమాలకు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. గడిచిన 24 గంటల్లో బుకే మై షోలో ఏ సినిమా టికెట్లు ఎక్కువగా అమ్ముడు పోయాయి, ఎంత పోయాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
గడిచిన 24 గంటల్లలో అంటే జనవరి 11వ తేదీ ఉదయం నుంచి జనవరి 12వ తేదీ ఉదయం వరకు.. బుక్ మై షోలో బుక్ అయిన టికెట్లు వివరాలు మనం ఇప్పుడు చూద్దాం. మహేష్ బాబు గుంటూరు కారం సినిమా రాత్రి ఒంటి గంట నుంచే థియేటర్లలో సందడి చేస్తుంది. ఈక్రమంలోనే అడ్వాన్స్ గా టికెట్లు బుక్ చేసుకున్నారు. అన్ని సినిమాలకంటే ఎక్కువగా గుంటూరు కారం సినిమా చూసేందుకే ఎక్కువ మంది టెకెట్లు బుక్ చేసుకున్నారు. ఒక్క బుక్ మై షో ద్వారానే 389.97 వేల టికెట్లు అమ్ముడు పోయాయి. 3 లక్షల 89 వేల 970 టికెట్లతో గుంటూరు కారం మొదటి స్థానంలో నిలిచింది.

ఇక రెండో స్థానంలో తేజ సజ్జా హీరోగా చేసిన హనుమాన్ చిత్రం నిలిచింది. ఈ సినిమా కూడా ఈరోజే విడుదల అవడంతో అనేక మంది ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్నారు. ఒక్క బుక్ మై షో ద్వారానే 164.92 వేల టికెట్లు అమ్ముడు పోయాయి. లక్షా 64 వేల 920 టికెట్లు బుక్ అవ్వగా రెండో స్థానంలో నిలిచింది. అలాగే మూడో స్థానంలో ధనుష్ హీరోగా చేసిన కెప్టెన్ మిల్లర్ సినిమా నిలిచింది. గత 24 గంటల్లో 67.48 వేల టికెట్లు అమ్ముడు అయ్యాయి. ఈ సినిమా కూడా జనవరి 12వ తేదీనే విడుదల అయింది. అయితే 67 వేల 480 టికెట్లు అమ్ముడు కాగా మూడో స్థానానికి పరిమితం అయింది.
ఇక నాలుగో స్థానంలో శివకార్తికేయన్ హీరోగా చేసిన అయలాన్ సినిమా నిలిచింది. అయలాన్ చిత్రాన్ని చూసేందుకు ఒక్క బుక్ మై షో ద్వారానే 54.63 వేల టికెట్లు అమ్ముడు పోయాయి. గడిచిన 24 గంటల్లో 54 వేల 630 టికెట్లను బుక్ చేసుకున్నారు. అలాగే చివరి స్థానంలో అంటే ఐదో స్థానంలో సైంధవ్ నిలిచింది. జనవరి 13వ తేదీన విడదుల కాబోయే ఈ సినిమాకు కూడా ముందు నుంచే టికెట్లు అందుబాటులో ఉండడంతో చాలా మందే అడ్వాన్స్ గా టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. శనివారం రాబోయే ఈ సినిమాకు గురవారం నుంచి అనేక మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇలా ఒక్క బుక్ మై షోలోనే 14 వేల 80 టికెట్లు అమ్ముడు పోయాయి.

ఇక నాగార్జున హీరోగా వస్తున్న నా సామి రంగా జనవరి 14వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాకు ఇప్పటికీ టికెట్లు అందుబాటులోకి రాలేవు. త్వరలోనే వస్తాయని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం థియేటర్లలో గుంటూరు కారం హవా ఎక్కువగా నడుస్తుండగా.. హనుమాన్ కూడా దూసుకు పోతుంది. చూడాలి మరి ఏ సినిమా ఎక్కువ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనేది.


Click it and Unblock the Notifications











