Bigg Boss Telugu: బిగ్‌బాస్‌ తెలుగులో నాగార్జునకు ఏ సీజన్ అంటే ఎక్కువ ఇష్టమో తెలుసా?

బిగ్ బాస్.. ఈ పేరు వింటే చాలు చాలా మంది ప్రేక్షకులు తెగ ఎగ్జైట్ అయిపోతుంటారు. అసలు ఈ షోను ఎవరు ప్రారంభించారో, ఎలా, ఎందుకో ఈ కాన్సెప్ట్ తో రావాలనిపించిందో తెలియదు కానీ.. అద్భుతమైన టీఆర్పీతో దూసుకెళ్తోంది. కొంతమంది సెలబ్రిటీలను తీసుకెళ్లి ఓ ఇంట్లో ఉంచడం, వారికి టాస్క్ లు ఇస్తూ.. ఎమోషనల్ గా ఎవరు స్ట్రాంగో తెలుసుకని విన్నర్ గా ప్రకటించే ఈ గేమ్ అంటే ఇష్టపడని వారు చాలా తక్కువ మంది. మొదట హిందీ భాషలో ప్రారంభమైన ఈ షో ఆ తర్వాత అనేక భాషల్లోకి పాకిపోయింది.

ముఖ్యంగా కన్నడ, బెంగాళీ, తమిళం, తెలుగు, మరాఠీ, మలయాళం.. ఇలా అన్ని భాషల్లోనూ కొనసాగుతూ.. అద్భుతమైన టీఆర్పీతో దూసుకెళ్తోంది. 2017లో తొలిసారిగా తెలుగులో అడుగు పెట్టిన ఈ బిగ్ బాస్ షో.. మొదటి సీజన్ కే విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈషోకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. ఇక ఆ తర్వాత వచ్చిన మూడో సీజన్ కు న్యాచురల్ స్టార్ నాని యాంకర్ గా చేశారు. ఈ రెండు సీజన్లు కూడా బుల్లితెర ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాయి.

 Do You Know Which Season of Bigg Boss Telugu Nagarjuna Likes The Most Check Details

ఇక మూడో సీజన్ నుంచి తర్వాత వచ్చిన అన్ని సీజన్లకు అక్కినేని నాగార్జుననే హోస్ట్ గా చేస్తున్నారు. ముఖ్యంగా 3, 4, 5, 6 సీజన్లకు కంటిన్యూగా ఆయనే యాంకర్ గా చేశారు. ఆ తర్వాత ఓటీటీ వేదికగా వచ్చిన బిగ్ బాస్ సీజన్ 1కు కూడా ఆయనే యాంకర్. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కొనసాగుతోంది. అయితే గతంలో ఎప్పుడూ లేనంతగా క్రేజీగా ఈసారి ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో మరింత కొత్తగా తీసుకు వచ్చారు బిగ్ బాస్ నిర్వాహకులు. ముందుగా 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపారు.

నాలుగు వారాలు కాగానే 2.0 పేరుతో మరో ఐదుగురు వైల్డ్ కార్ట్ ఎంట్రీలను ఇంట్లోకి తెచ్చారు. అప్పటికే ఇంట్లో ఉన్న ఒకరిని సీక్రెట్ రూంలో వేయడం.. ఆ తర్వాత వారమే ముందు వారాల్లో ఎలిమినేట్ అయిన మరో కంటెస్టెంట్ ను హౌస్ లోకి తీసుకురావడం.. ఇలా రోజుకో ట్విస్ట్ ఇస్తూ షోను మరింత రసవత్తరంగా మలుస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక చాలా మంది ప్రతిరోజూ షో చూస్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తాజాగా కింగ్ నాగార్జున ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

 Do You Know Which Season of Bigg Boss Telugu Nagarjuna Likes The Most Check Details

తెలుగులో వచ్చిన 7 సీజన్లలో మీకు ఏ సీజన్ అంటే ఇష్టం అని ఆయనను అడగ్గా.. షాకింగ్ న్యూస్ చెప్పారు. కాంట్రవర్సీ చేయాలని చూస్తున్నారా అంటూనే.. తనకు ప్రస్తుతం వస్తున్న ఏడో సీజన్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు. అయితే అందుకు కారణం ఇంట్లో ఉన్న కంటెస్టెంట్లో, సెలబ్రిటీలో కాదని.. ఉల్టాపుల్టా అంటూ సరికొత్తగా సాగడమేనని కూడా వెల్లడించారు. ఎలా అయితేనేం తనకు ఏ సీజన్ ఇష్టమే చెప్పి బుల్లితెర ప్రేక్షకులను మరింత సర్ ప్రైజ్ చేశారు. మీకూ ఇదే సీజన్ ఇష్టమా.. కాదా.. కామెంట్ల రూపంలో చెప్పండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X