Sankranthi 2025: స్టార్ హీరోల సినిమాలన్నీ వచ్చే సంక్రాంతికే.. ఎవరెవరు లైన్‌లో ఉన్నారంటే?

పండుగలు వస్తున్నాయంటే చాలు అనేక సినిమాలు విడుదలకు సిద్ధం అవుతుంటాయి. అయితే శుక్రవారం లేదా పండుగల అప్పుడు సినిమాలు రిలీజ్ చేయాలని చాలా మంది భావిస్తుంటారు. అప్పుడే విడుదల కూడా చేస్తుంటారు. అందుకే ముందుగా పండుగల తేదీలను లాక్ చేసి పెట్టుకుంటారు. ఓ రెండు, మూడు నెలల ముందు నుంచి ఇలా జరుగుతుండడం చాలా సహజం. కానీ వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కోసం అనేక సినిమాలు లాక్ అవుతున్నాయి. చాలా మంది పెద్ద పెద్ద హీరోలు అంతా తమ చిత్రాలను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. ఆ సినిమాల వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న తాజా సినిమా విశ్ంవంభర. అయితే ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ముఖ్యంగా 2025 జనవరి 10వ తేదీన విశ్వంభర సినిమాను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. మరోవైపు దిల్ రాజు శతమానం భవతి సీక్వెల్ సినిమా వచ్చే సంక్రాంతికి రానున్నట్లు ప్రకటించారు. ఆ సినిమాలో నటీనటులు ఎవరు అనేది ప్రకటించకపోయినప్పటికీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. చూడాలి మరి ఈ సినిమా ఎవరి దర్శకత్వంలో వస్తుంది.. ఎవరెవరు నటించనున్నారనేది.

Do You Know Which Star Heros Movies Going to be Released on Sankranthi 2025 Check Full Details

అలాగే అక్కినేనా నాగార్జున కూడా ఓ సూపర్ సినిమాతో వచ్చే సంక్రాంతికి కలుద్దామని... నా సామిరంగా సినిమా సక్సెస్ మీట్ లో చెప్పారు. ఆయన ఏ సినిమాతో వస్తారు, ఎవరు దర్శకత్వం వహించబోతున్నారు వంటి వివరాలు ఇంకా తెలియదు. కానీ ఈ సినిమా కచ్చితంగా వచ్చే సంక్రాంతికి రాబోతున్నట్లు కన్ఫార్మ్ అయిపోయింది. ఇక ఇదిలా ఉండగా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న రాజా సాబ్ చిత్రాన్ని కూడా వచ్చే ఏడాది సంక్రాంతికే విడుదల చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ముందుగా ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలని ప్లాన్ వేశారు.

Do You Know Which Star Heros Movies Going to be Released on Sankranthi 2025 Check Full Details

కానీ ఈ ఏడాది దసరా వరకు ఈ సినిమా పూర్తి అయ్యే ఛాన్స్ లేదని.. అందుకే వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారట. ఇంకా అఫీషియల్ గా దీని గురించి ప్రకటించకోపయినప్పటికీ.. కచ్చితంగా అప్పుడే వస్తుందని తెలుస్తోంది. మరోవైపు బాబు డైరెక్షన్ లో నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా రాబోతున్న సినిమా సంక్రాంతికి వస్తుందని సమాచారం. అలాగే వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న సినిమా కూడా అప్పుడే వస్తుందని అంతా అనుకుంటున్నారు. ఇవే కాకుండా ఇంకా ఎన్ని సినిమాలు సంక్రాంతి పండుగ సందర్భంగా రాబోతున్నట్లు టాక్ నడుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X