కల్కిలో ప్రభాస్ పాత్రను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా? భైరవ రోల్‌ను ఎందుకు వదులుకొన్నారంటే?

కల్కి 2898 AD చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతున్నది. ఈ సినిమాలో నటించిన అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపిక పదుకోన్ లాంటి యాక్టర్లకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తున్నది. ఇక ఈ మూవీ విడుదలైన ప్రతీ చోట రికార్డులు తిరగరాసే కలెక్షన్లు రాబడుతున్నది. అయితే ఇలాంటి చారిత్రాత్మక చిత్రాన్ని ప్రభాస్ కంటే ముందు ఓ సూపర్ స్టార్ ముందుకు అవకాశం వస్తే ఆయన రిజెక్ట్ చేశారు. ఆ స్టార్ హీరో ఎవరనే విషయంలోకి వెళితే..

మహానటి సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకొన్న తర్వాత మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ప్రెస్‌మీట్ జరిగింది. ఆ మీట్‌లో నాగ్ అశ్విన్‌ను, నిర్మాత సీ అశ్వినీదత్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ఆ సందర్భంగా వారి మధ్య జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా సీక్వెల్ ఆలోచన వచ్చింది. అయితే ఆ ఆలోచన అలాగే ఆగిపోయింది.

Do You Know Which Superstar rejected Prabhas role Bhairava in Kalki 2898 AD

ఆ తర్వాత కొద్ది రోజులకు చిరంజీవిని కలిసి నాగ్ అశ్విన్ తాను రాసుకొన్న కల్కి కథను వినిపించాడు. ఆ కథ విన్న వెంటనే సినిమా కథ బాగుంది. తప్పకుండా అద్బుతమైన విజయాన్ని అందుకొంటుందని మెగాస్టార్ భరోసా ఇచ్చాడు. నాగీ కథ చెప్పిన విధానం.. అతడి విజన్‌కు చిరు ముచ్చటపడ్డారు.

అయితే చిరంజీవి ప్రశంసలు గుప్పించడంతో నాగ్ అశ్విన్ తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు. ఈ సినిమా కథ మీ కోసమే రాశాను. మీరు ఒప్పుకొంటే మీతో సినిమా చేయాలనే ఆలోచన ఉంది అని చెబితే.. వెంటనే చిరంజీవి నిరాకరించారు. ఈ సినిమాలోని భైరవ పాత్రను నేను చేస్తే కరెక్ట్ కాదు అని తన జడ్జిమెంట్‌ను ఇచ్చారట.

Do You Know Which Superstar rejected Prabhas role Bhairava in Kalki 2898 AD

ఇక చిరంజీవి స్వయంగా భైరవ పాత్రకు ప్రభాస్ అయితే కరెక్ట్ పర్సన్. ఆయనతో సినిమా తీస్తే కథకు న్యాయం జరుగుతుంది. అంతేకాకుండా రీచ్ ఎక్కువగా ఉంటుందని తన అభిప్రాయాన్ని చిరంజీవి మెహమాటం లేకుండా చెప్పారట. దాంతో కల్కి సినిమా ప్రాజెక్టు ప్రభాస్ వద్దకు వెళ్లింది. ప్రస్తుతం ఆ సినిమా హిస్టరీ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నది.

ఇక జూన్ 27వ తేదీన రిలీజైన ఈ చిత్రం కేవలం 5 రోజుల్లోనే 600 కోట్ల రూపాయల కలెక్షన్లను వసూలు చేసింది. ఈ చిత్రం త్వరలోనే 1000 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరేందుకు పరుగులు పెడుతున్నది. ఓవర్సీస్‌లో కూడా రికార్డు స్థాయి కలెక్షన్లు రాబడుతున్నది.

More from Filmibeat

Read more about: prabhas kalki 2898 ad chiranjeevi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X