ఫ్యామిలీ స్టార్, టిల్లు స్క్వేర్.. ఏ సినిమాకు ఎక్కువ టికెట్లు అమ్ముడుపోయాయో తెలుసా?

మార్చి నెల చివరి వారంతో పాటు ఏప్రిల్ నెల మొదటి వారంలో విడుదల అయిన పలు సినిమాలపై సినీ ప్రియులు విపరీతమైన ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా మూడు తెలుగు చిత్రాలు రిలీజ్ కాగా... అంతా ఎగబడి మరీ చూస్తున్నారు. టిల్లు స్క్వేర్, ఫ్యామిలీ స్టార్, మంజుమ్మల్ బాయ్స్.. ఈ మూడు చిత్రాల హవా ఎక్కువగా కొనసాగుతోంది. ఈ మూడు సినిమాలపై భారీ అంచనాలు నమోదు కాగా.. ప్రస్తుతం ఏ సినిమాను ఎక్కువ మంది చూస్తున్నారు, ఎక్కువ ఏ చిత్రం టికెట్లు అమ్ముడుపోయాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఎక్కువ మంది తనకు నచ్చిన హీరో లేదంటే పాజిటివ్, హిట్ టాక్ వచ్చిన చిత్రాలను చూస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో పాటు వెళ్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో.. అంటే ఏప్రిల్ 5వ తేదీ ఉదయం నుంచి ఏప్రిల్ 6వ తేదీ ఉదయం వరకు ఎన్ని టికెట్లు బుక్ అయ్యాయి.. ఏ సినిమాను చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Do You Know Which Telugu Movie Sold More Tickets on April 6th Check Details

విజయ్ దేవరకొండ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా వచ్చిన రీసెంట్ మూవీ ఫ్యామిలీ స్టార్ కు ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. పరుశురాం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను చూసేందుకు గడిచిన 24 గంటల్లో మొత్తం 112.43కే మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. ఒక్క బుక్ మై షోలోనే... లక్షా 12 వేల 430 మంది ఫ్యామిలీ స్టార్ సినిమా చూసేందుకు టికెట్లు బుక్ చేసుకోగా.. టాప్ 1లో నిలిచింది. ఇలా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా తర్వాత స్థానంలో టిల్లు స్క్వేర్ నిలిచింది.

Do You Know Which Telugu Movie Sold More Tickets on April 6th Check Details

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా వచ్చిన రీసెంట్ సూపర్ హిట్ సినిమానే టిల్లు స్క్వేర్. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా కుర్రకారును ఉర్రూతలూగిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాను చూసేందుకు గడిచిన 24 గంటల్లో మొత్తం 57.67కే టికెట్లు అమ్ముడు పోయాయి. అంటే 57 వేల 670 మంది ఈ సినిమాను చూసేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇలా టాప్ 2లో నిలిచిందీ చిత్రం. త్వరలోనే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని టాక్ నడుస్తోంది.

ఇక చివరి స్థానంలో అంటే టాప్ 3లో మంజుమ్మల్ బాయ్స్ నిలిచింది. మలయాళంలో విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా తెలుగులో విడుదల కాగా.. గడిచిన 24 గంటల్లో మొత్తం 10.02కే మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. ఒక్క బుక్ మై షో ద్వారానే 10 వేల 20 మంది ఈ సినిమా చూడబోతున్నారు. ఇలా ఈ మూడు సినిమాలు థియేటర్ల వద్ద తెగ సందడి చేస్తున్నాయి. మీరు కూడా ఇప్పటి వరకు ఇందులో ఏ ఒక్క సినిమా చూడకపోయినా వెంటనే వెళ్లి చూసేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X