విజయ్ దేవరకొండను వెనక్కినెట్టిన టిల్లుగాడు.. లిల్లీని చూసేందుకు ఎంత మంది వెళ్లారో తెలుసా?
ఉగాది పండుగ సందర్భంగా పలు సినిమాలు థియేటర్లలో విడుదల అయ్యేందుకు ఇప్పటికే సిద్ధం అయ్యాయి. అయితే వీటిలో అంత పెద్ద చిత్రాలు ఏమీ లేవు కాబట్టి.. ఇప్పటికే విడుదల అయిన సినిమాలే ఎక్కువ రోజులు ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగులో అయితే ఫ్యామిలీ స్టార్, టిల్లు స్క్వేర్, మంజుమ్మల్ బాయ్స్ మాత్రమే ఉన్నాయి. అయితే ఈ సినిమా టాప్ 1లో సిద్ధు జొన్నలగ్డడ హీరోగా చేసిన టిల్లు స్క్వేర్ నిలవగా.. విజయ్ దేవరకొండ వెనుక పడిపోయాడు.
చాలా మంది అభిమానులు తమకు నచ్చిన హీరో సినిమాలు లేదంటే థియేటర్ల వద్ద హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు చూసేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో పాటు వెళ్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో బుక్ మై షోలో ఎక్కువ మంది ఏ చిత్రం చూసేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు.. ఇలా ఎక్కువ మంది ఏ చిత్రాన్ని ఇష్టపడుతున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఏప్రిల్ 7వ తేదీ ఉదయం నుంచి ఏప్రిల్ 8వ తేదీ ఉదయం వరకు ఒక్క బుక్ మై షో వేదికగానే.. టిల్లు స్క్వేర్ సినిమాకు ఎక్కువ మొత్తంలో టికెట్లు బుక్ అయ్యాయి. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా కుర్రకారును ఉర్రూతలూగిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాను చూసేందుకు గడిచిన 24 గంటల్లో మొత్తం 70.57కే టికెట్లు అమ్ముడు పోయాయి. అంటే 70 వేల 570 మంది ఈ సినిమాను చూసేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు.
ఇక టాప్ 2లో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా నిలిచింది. పరుశురాం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఆషించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టుకోలేకపోతుంది. కానీ పాజిటివ్ టాక్ తోనే దూసుకు వెళ్తుంది. ఈ చిత్రాన్ని చూసేందుకు గడిచిన 24 గంటల్లో మొత్తం 53.33కే మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. అంటే 53 వేల 330 మంది ఫ్యామిలీ స్టార్ సినిమా చూసేందుకు టికెట్లు బుక్ చేసుకోగా.. ఇలా రెండో స్థానంలో నిలిచింది.

ఇక టాప్ 3లో ఇక మంజుమ్మల్ బాయ్స్ నిలిచింది. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది. తెలుగు వాళ్లు కూడా ఈ సినిమా చూసేందుకు ఆసక్తి కనబర్చగా.. అది గుర్తించిన దర్శక నిర్మాతలు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు. అయితే ఈ చిత్రాన్ని గడిచిన 24 గంటల్లో మొత్తం 3.61కే మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. ఒక్క బుక్ మై షో ద్వారానే 30 వేల 610 మంది ఈ సినిమా చూడబోతున్నారు. ప్రస్తుతం థియేటర్ల వద్ద తెగ సందడి చేస్తున్న ఈ మూడు సినిమాలను మీరు కూడా చూసేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











