పుష్ప సినిమాలో కేశవ ఛాన్స్ మిస్ చేసుకున్న తెలుగు కుర్రాడు ఎవరు, ఎందుకో తెలుసా?

అల్లు అర్జున్ హీరోగా వచ్చిన చివరి సినిమా పుష్ప గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదేలే నీ యవ్వా అంటూ వచ్చి అందరినీ మెస్మరైజ్ చేశాడు. 2021లో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్.. బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. అయితే ఈ సినిమాలో ఎప్పుడూ హీరో పక్కనే ఉండి తెగ సందడి చేసిన ఆన స్నేహితుడు.. కేశవకు కూడా విపరీతమైన గుర్తింపు వచ్చింది.

కేశవ క్యారెక్టర్ లో కనిపించిన ఆర్టిస్ట్ రియల్ నేమ్ జగదీష్ ప్రతాప్ బండారి. అయితే ఈ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ ఈయన కాదట. ఓ సూపర్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ ను సెలెక్ట్ చేసుకుని.. ఆయన కోసమే ఈ క్యారెక్టర్ ను డిజైన్ చేశారట. కానీ చివరకు ఆయనను కాకుండా ఈ సినిమాలో వేరకొరిని తీసుకున్నారట. అసలు ముందుగా తీసుకుంటామని చెప్పిన ఆ తెలుగు కుర్రాడు ఎవరు, ఎందుకు అతడిని తీసుకోలేదు వంటి వివరాలు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Do You Know Whick Telugu Actor Miss The Chance in Pushpa Movie Keshava Character Check Details

పుష్ప.. పుష్ప రాజ్.. తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసును బద్ధలు చేసింది. అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా సుకుమార్ తెరకెక్కింకించిన ఈ సినిమా.. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరికి మంచి గుర్తింపే వచ్చింది. చాలా మందికి అదిరిపోయే క్యారెక్టర్లు ఇచ్చి అందరికీ గుర్తిండిపోయేలా చేశారు సుకుమార్.

ముఖ్యంగా అల్లు అర్జున్ స్నేహితుడి పాత్ర అంటే కేశవ ప్రాతలో కనిపించిన జగదీష్ ప్రతాప్ బండారి కూడా విపరీతమైన గుర్తింపు వచ్చింది. అయితే ఈయన ఈ సినిమాకు పస్ట్ ఛాయిస్ కాదంట. ఈ సినిమాలో ముందుగా అచ్చమైన తెలుగు అబ్బాయి, సూపర్ టాలెంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, బిగ్ బాస్ కంటెస్టెంట్.. మహేష్ విట్టాను తీసుకున్నారట. నేరుగా సుకుమార్ యే రంగంలోకి దిగి మరీ మహేష్ ను సెలెక్ట్ చేసుకున్నారట. కానీ చివరి నిమిషంలో ఈ సినిమాలోంచి ఆయన్ను తీసేశారట.

Do You Know Whick Telugu Actor Miss The Chance in Pushpa Movie Keshava Character Check Details

ఆ సంవత్సరం ఈయన ప్యాడింగ్ లో లేకపోవడం అంటే.. ఆ ఏడాది ఎలాంటి సినిమాలు చేయకపోవడం.. తక్కువ డబ్బులకు చేసే వాళ్లను తీసుకోవడం... ముఖ్యంగా కొత్త వాళ్లను తీసుకుంటే బాగుందని భావించిన మూవీం టీం ఈయనను తీసేసి జగదీష్ ప్రతాప్ బండారిని పెట్టుకున్నారట. ఈ క్యారెక్టర్ మిస్ అయినందుకు మహేష్ చాలానే ఫీల్ అయ్యాడట. కానీ ముందు ముందు కూడా మంచి ఛాన్సులు వస్తాయనే ఆశతో కాలం వెళ్లబుచ్చుతున్నట్లు తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X