చిరుత మధ్యలో ఆగిపోయిందా? రాంచరణ్ మూవీకి ఫస్ట్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫస్ట్ మూవీ చిరుత అనే విషయం అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ ను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ మేనరిజం ఇప్పటికీ ప్రేక్షకులు మరువలేనిదే. మాస్, క్లాస్, స్టైల్ కలగలిపి రామ్ చరణ్ డెబ్యూ మూవీకి ఒక ఎనర్జిటిక్ క్యారెక్టర్రైజేషన్ పడింది. రామ్ చరణ్ కెరియర్ లో ఎన్ని సినిమాలు చేసినప్పటికీ ఈ సినిమాకు ఉండే ప్రత్యేకతనే వేరు. మూవీలో రామ్ చరణ్ ఆటిట్యూడ్ కి ఫిదా అవని వారంటూ ఉండరు. ఆ రేంజ్ లో పూరి జగన్నాథ్ సినిమాను తెరకెక్కించారు.

పూరి జగన్నాథ్ రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ యావరేజ్ హిట్ గా నిలిచింది. ఈ యాక్షన్ డ్రామాను వైజయంతి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి అశ్వనీ దత్ నిర్మించారు. 100% వసూలను మాత్రం సాధించింది. మెగా అభిమానులను సాటిస్ఫై చేసింది. నేహా శర్మ హీరోయిన్గా నటించింది. ప్రముఖ కమెడియన్ అలీ కీలక పాత్రను పోషించారు. మణిరత్నం సంగీతం అందించారు. ఇప్పటికీ ఆయన అందించిన సంగీతం సంగీత ప్రియులను అలరింప చేస్తోంది.

Do you know who is first director of Ram charan s chirutha movie

2007లో వచ్చిన ఈ చిత్రం జీ తెలుగులో పలుమార్లు ప్రసారమైతూనే ఉంది. 7 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రూ.22 కోట్ల షేర్ ను వసూలు చేసింది. అయితే ఈ సినిమా గురించి 18 ఏళ్ల తర్వాత షాకింగ్ విషయం తెలిసింది. ప్రముఖ సినీ రైటర్ తోట ప్రసాద్ ఆ విషయాన్ని బయటకు తీసుకొచ్చారు. చిరుత సినిమా మొదటి డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాదని తెలిసిపోయింది. మరో ప్రముఖ దర్శకుడు ఆ స్టోరీని డైరెక్ట్ చేయాల్సి ఉందని తెలిపారు. ఇప్పుడు ఈ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

తోట ప్రసాద్ రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరుత సినిమా గురించి చెప్పారు. ఆ సినిమా కథను మొదట ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ డైరెక్ట్ చేయాల్సి ఉండిందన్నారు. బ్యాంకాక్ లో షూటింగ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారని, 2004 సమయంలో ఈ కథను చిత్రీకరించేందుకు సర్వం సిద్ధం చేశారన్నారు. సాయిరాం శంకర్ హీరోగా రావాల్సి ఉండిందన్నారు. కానీ అప్పుడు బ్యాంకాక్ లో తూఫాన్ రావడం వల్ల ఆ సినిమా ఆగిపోయిందని, దాని తర్వాత చిరుత సినిమా కథ మెహర్ రమేష్ నుంచి తప్పించుకుందని రైటర్ తోట ప్రసాద్ తెలిపారు.

ఆ తర్వాత రెండేళ్లకు దర్శకుడు పూరి జగన్నాథ్ ఆ కథను తీసుకొని, పలు మార్పులు చేర్పులు చేసి చిరుత టైటిల్ తో సినిమా తీశారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ న్యూస్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. ఇక ఇలాంటి విషయాలు చిత్ర పరిశ్రమలో సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి. ఒకరి కోసం సిద్ధం చేసిన కథ మరొకరికి వెళ్లి వారి కెరియర్నే మార్చేస్తుంది. చిరుత సినిమా తర్వాత రామ్ చరణ్ ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ లు చేశారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా కీర్తి పొందుతున్నారు మన మెగా పవర్ స్టార్. చివరిగా గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. నెక్స్ట్ బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే మోస్ట్ అవైటెడ్ ఫిలింలో నటిస్తున్నారు. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఆర్ సి 16 ప్రాజెక్టులో జాయిన్ కాబోతున్నారు.

More from Filmibeat

Read more about: ram charan chirutha meher ramesh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X