తెలుగు సినీ రంగానికి మరో లేడీ విలన్ దొరికేసిందిగా.. రమ్యకృష్ణను మరిపిస్తుందా మరి!
ఈ మధ్య ఎక్కువగా హీరో విశాల్ వదిన శ్రియారెడ్డి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. సలార్ సినిమాలో ఈ ముద్దుగుమ్మ కనబర్చిన నటనకు మంచి గుర్తింపే దక్కింది. ఆమె టాలెంట్ కు తగ్గ రోల్ పడితే గానీ ఆమెలోని అసలు నటన బయటకు రాలేకపోయింది. ఆమెలోని ప్రతిభను గుర్తించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అసలైన క్యారెక్టర్ ఇచ్చి టాలీవుడ్ కు ఓ స్పెషల్ లేడీ విలన్ ను అందించారు. ముఖ్యంగా సలార్ సినిమాలో వరదరాజు సోదరి పాత్రలో కనిపించి శ్రియారెడ్డి అందరినీ మెస్మరైజ్ చేసింది. ఈమె నటనకు గాను దేశవ్యాప్తంగా సినీ ప్రియులు పెద్ద ఎత్తున అభినందిస్తున్నారు.
ముఖ్యంగా బాహుబలి సినిమాలో ప్రభాస్ కు తల్లిగా కనిపించిన శివగామి రమ్యకృష్ణ యాక్టింగ్ కు ఈమె ఏమాత్రం తక్కువగా నటించలేదని అంతా అంటున్నారు. పెద్ద ఎత్తున ప్రశంసిస్తున్నారు. రాబోయే అనేక చిత్రాల్లో ఈమెకు మరింత మంచి మంచి క్యారెక్టర్ లు వస్తాయని కామెంట్లు చేస్తున్నారు. అయితే అసలు శ్రియారెడ్డి ఎవరు, ఈమె ఏయే చిత్రాలు చేసింది వంటి విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Recommended Video


తమిళ హీరో విశాల్ అన్న భార్య అయిన శ్రియా రెడ్డికి ప్రస్తుతం 40 ఏళ్ల వయసు. 2002లో తమిళ సినిమా సామురాయ్ ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఏడాదే తెలుగులో అప్పుడప్పుడు అనే సినిమాలో కూడా నటించి మెప్పించింది. ఆ తర్వాత మలయాళ ఇండస్ట్రీకి కూడా బ్లాక్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 19 రెవల్యుషన్స్, భరత్ చంద్రన్ ఐపీఎస్, అమ్మ చెప్పింది, ఒరాల్, తిమిరు, వెయిల్, పల్లికూడం, కాంచివరం, సిల సమయంగలిల్, అండవ కానుమ్, సుడల్ వంటి సినిమాల్లోనూ నటనతో అదరగొట్టింది.

ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషల్లో నటించి మెప్పించిన ఈమె కెరియర్ మొదట్లో యాంకర్ గా, వీజేగా కూడా పని చేసింది. ఎక్కడో యాంకర్ గా కెరియర్ ప్రారంభించిన ఈమె ఇప్పుడు తెలుగు సినీ రంగంలోనే టాప్ విలన్ గా మారి శాసించబోతుందంటే వినడానికే చాలా బాగా అనిపిస్తోంది. మరి ముందు ముందు ఈ ముద్దుగుమ్మ ఇంకెలాంటి సినిమాల్లో కనిపించి ఎంత పేరు తెచ్చుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











