బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రను మిస్ చేసుకున్న బాలీవుడ్ హీరో.. ఎవరు, ఎందుకో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దగ్గుబాటి రాణా కాంబినేషన్ లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన బాహుబలి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీసును బద్ధలు చేసింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరికీ విపరీతమైన గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా కట్టప్ప పాత్ర అయితే హైలెట్ అనే చెప్పాలి. అయితే ఈ పాత్ర కోసం ముందుగా ఓ బాలీవుడ్ స్టార్ హీరోను అనుకున్నారట. కానీ ఆయన నో చెప్పడంతో సత్యరాజ్ ను తీసుకున్నారు. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరో, రాణా విలన్ గా వచ్చిన ఈ సినిమాలో చాలా మంది అగ్రతారలు నటించారు. ముఖ్యంగా అనుష్క శెట్టి, తమన్నా భాటియా, రమ్యకృష్ణ, నాజర్, అడివి శేష్, భద్ర, సత్యరాజ్, సుదీప్, తనికెళ్ల భరణి, రోహిణి, ప్రభాకర్ గౌడ్ వంటి వాళ్లంతా ఈ చిత్రంలో నటించి మెప్పించారు. అలాగే 125 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రానికి 650 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఈ సినిమాలో నటించిన వాళ్లతో పాటు దర్శక, నిర్మాతలకు ఫుల్ గా లాభాలు వచ్చాయి.

 Do You Know Who Missed The Chance in Bahubali Movie Kattappa Character Check Details

కేవలం లాభాలు మాత్రమే కాదండోయ్... సినిమాలో కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ విపరీతమైన క్రేజ్ వచ్చింది. అయితే ఈ సినిమాలో కట్టప్పగా కనిపించిన సత్యరాజ్ కు అయితే మరింత ఎక్కువ గుర్తింపు వచ్చింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న ప్రశ్నతో బాహుబలి 2పై మరింత క్రేజ్ వచ్చేలా చేశారు. ఇలా కట్టప్పను చాలా హైలెట్ చేసిన ఈ చిత్రంలో ముందుగా కట్టప్పగా... సత్యరాజ్ ను అనుకోలేదట. తన నటనతో అదరగొట్టిన సత్యరాజ్ కాకుండా ఓ బాలీవుడ్ ను హీరోను తీసుకోవాలనుకున్నారట.

ఆ బాలీవుడ్ హీరో మెరవరో కాదు సంజయ్ దత్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ యే ఈవిషయాన్ని వివరించారు. అయితే ఈ సినిమా కథ ప్రభాస్ కోసమే రాసుకున్నప్పటికీ.. కట్టప్పగా మాత్రం సంజయ్ దత్ ను తీసుకోవాలని ప్లాన్ చేశారట. కానీ ఆయన అందుబాటులో లేకపోవడంతో.. ఈ సినిమాలో కట్టప్పగా వేరే వాళ్లని తీసుకోవాలని డిసైడ్ చేసుకున్నారట.

 Do You Know Who Missed The Chance in Bahubali Movie Kattappa Character Check Details

ఈ క్రమంలోనే సత్యరాజ్ ను ఈ సినిమాలో కట్టప్పగా తీసుకుంటే బాగుంటుందనిపించి ఆయనను సంప్రదించగా... ఆయన కూడా ఓకే చెప్పారట. ఇలా సత్యరాజ్ కట్టప్పగా మారి తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్, సూపర్ క్రేజ్ వచ్చిన పాత్రలో కనిపించారు. వందల ఏళ్ల పాటు ఆయనను గుర్తుంచుకునేలా చేసుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X