రంగస్థలం సినిమాలో విలన్ ఛాన్స్‌ను మిస్ చేసుకున్న స్టార్ నటుడు ఎవరో తెలుసా?

గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమానే రంగస్థలం. చెవులు వినిపించని పాత్రలో చిట్టిబాబులో చెర్రీ యాక్టింగ్ ఇరగదీయగా.. సామ్ కూడా రామలక్ష్మి పాత్రలో అదరగొట్టింది. అయితే సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరికీ మంచి గుర్తింపే వచ్చింది. ముఖ్యంగా విలన్ లుగా జగపతి బాబు, ప్రకాష్ రాజ్ లు అదరగొట్టారు. జగపతి బాబు పాత్రలో ముందుగా వేరే నటుడిని తీసుకోవాల్సి ఉండగా.. ఈయన్ను తీసుకున్నారట. అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకున్న నటుడు ఎవరు, ఎందుకో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సుకుమార్ డైరెక్షన్ లో 2018లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన ఈ సినిమాలో నటించి వాళ్లందరికీ మంచి గుర్తింపే వచ్చింది. ముఖ్యంగా సమంత, రామ్ చరణ్, ఆది పినిశెట్టిలతో పాటు యాంకర్ అనసూయలు అదిరిపోయే గెటప్ లలో కనిపించి మెస్మరైజ్ చేశారు. అలాగే విలన్లుగా కనిపించిన ప్రకాష్ రాజ్, జగపతి బాబులు కూడా తమలోని టాలెంట్ ను మరోసారి తెరపై చూపించారు.

Do You Know Who Missed The Chance in Rangasthalam Movie Check Details

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వై.నవీన్, వై.రవిశంకర్, సి.వి.మోహన్ రంగస్థలం సినిమాను నిర్మించారు. అలాగే దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ముఖ్యంగా ఈయన చేసిన మ్యాజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు. ప్రపంచ వ్యాప్తంగా రూ.210 కోట్లు వసూలు చేసిన ఈ సినిమాకు ఇప్పటికీ పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికీ ఈ చిత్రం వస్తుందంటే చాలు టీవీల ముందు వాలిపోతుంటారు చాలా మంది.

అయితే ఈ సినిమాలో ఓ స్టార్ నటుడు విలన్ పాత్రను మిస్ చేసుకున్నాడట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. రంగస్థలం సినిమాలో జగపతి బాబు పాత్రలో అంటే.. రంగస్థలం గ్రామం ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి పాత్రలో ముందుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అప్పాజి అంబరీషను తీసుకున్నారట. ముందుగా తక్కువ బడ్జెట్ అనుకుని.. చిన్న నటులను తీసుకోవడం.. ఆ తర్వాత భారీ తారాగణంతో చేయాలనుకుని తనను జగపతి బాబు రైట్ హాండ్ పాత్రలో పెట్టారని చెప్పారు.

Do You Know Who Missed The Chance in Rangasthalam Movie Check Details

సరే ఆ పాత్ర అయినా ఓకే అనుకుని తాను చేస్తానని చెప్పి.. డేట్లు కూడా ఇచ్చారట. కానీ రెండు రోజుల్లో షూటింగ్ ప్రారంభం అవుతుందని అనగా.. ప్రొడక్షన్ హౌస్ వాళ్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు తాను ఫోన్ చేస్తే తీయడం మానేశశారని.. లిఫ్ట్ చేసిన ఏవేవో చెప్పి తనను పక్కన పెట్టేశారని అన్నారు. ఇది తొలిసారి కాదని ఇలా సార్లు తనకు జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. 30, 40 సినిమాలు చేసిన తనకు ఇప్పటికీ ఆడిషన్స్ పెడుతూ.. ఇబ్బంది పెడతారని కూడా అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X