Save The Tigers సిరీస్‌లో సుజాత పాత్రను మిస్ చేసుకున్న జబర్దస్త్ బ్యూటీ ఎవరంటే?

గతేడాది వచ్చి ఓటీటీ ప్రియులు అందరినీ మెస్మరైజ్ చేసి కడుపుబ్బా నవ్వించిన వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన కాన్సెప్ట్ తో వచ్చి అందిరనీ అలరించిన ఈ సిరీస్ లో భార్యాభర్తల మధ్య సాగే గొడవలు, ప్రేమలు, కామెడీని చాలా బాగా చూపించారు. అందుకే ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్ గా నిలిచింది. ఇటీవలే దీనికి సీక్వెల్ గా పార్ట్ 2 కూడా వచ్చేసింది.

అయితే ఈ సిరీస్ లో మొత్తం మూడు జంటలకు సంబంధించిన కథను చూపించగా.. అచ్చమైన తెలంగాణ యాసలో మాట్లాడిన ప్రియదర్శి, జోర్దార్ సుజాతల జోడీ హైలెట్ గా నిలిచింది. వీరి జంటకు వస్తున్న రెస్పాన్స్ నెక్ట్స్ లెవెల్ అనే చెప్పొచ్చు. అయితే ఈ గంటా రవి భార్యగా.. అంటే జోర్దార్ సుజాత కనిపించిన పాత్రలో ముందుగా వేరే అమ్మాయిని తీసుకోవాలనుకున్నారట. కానీ ఆమె నో చెప్పగా.. సుజాతకు అవకాశం వచ్చింది. మరి హైమా పాత్రను మిస్ చేసుకున్న ముద్దుగుమ్మ ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Do You Know Who Missed The Chance in Save The Tigers Web Series Jordar Sujatha Character Check Details

సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ కు వస్తున్న రెస్పాన్స్ గురించి అందరికీ తెలిసిందే. పార్ట్ 1 లాగే పార్ట్ 2కు కూడా విపరీతమైన స్పందన వస్తుంది. అంతా ఈ సిరీస్ ను చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రియదర్శి, చైతన్య కృష్ణ, అభినవ్ గోమఠం, జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని శర్మ, యూట్యూబర్ గంగవ్వ, జబర్దస్త్ రోహిణిలు ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సిరీస్ పార్ట్ 2 కూడా మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంటుంది.

అయితే ఈ సిరీస్ లో అందరు మెచ్చిన జోడీగా నిలిచిన ప్రియదర్శి, జోర్దార్ సుజాతలు నిలిచారు. వీరి జంటకు సెపరేట్ ప్యాన్స్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. అయితే గంటా రవి భార్యగా, హైమా పాత్ర కోసం ముందుగా వేరే అమ్మాయిని తీసుకోవాలనుకున్నారట. ఆమె మరెవరో కాదు జబర్దస్త్ లేడీ కమెడియన్ రోహిణి. అయితే ఆమెకు వేరే ప్రాజెక్టులు చేతిలో ఉండడం.. డేట్లు కుదరక రోహిణి హైమా పాత్రకు నో చెప్పిందట. ఆ తర్వాత సుజాతను ఆ పాత్ర కోసం తీసుకున్నారట.

Do You Know Who Missed The Chance in Save The Tigers Web Series Jordar Sujatha Character Check Details

ఆ తర్వాత కొంత కాలానికి ఈ సిరీస్ లో పని మనిషి పాత్ర కోసం మరోసారి రోహిణిని తీసుకోవాలని అనుకొని.. ఆమెకు చెప్పారట. డేట్లు కుదిరే వీలు ఉండడంతో.. ముఖ్యంగా తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉండడంతో, అభినవ్ గోమఠం కాంబినేషన్ కావడంతో వెంటనే చేస్తానని చెప్పిందట. ఇలా పనిమనిషిగా చేస్తున్న ఈమె యాక్టింగ్ చేస్తున్న సమయంలో.. సుజాత పాత్రను చూసి చాలా ఎగ్జైట్ అయిందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రోహిణి ఆ పాత్రకు సుజాతనే న్యాయం చేసిందని... తాను అయితే అంత న్యాయం చేయకపోయేదాన్నేనని వెల్లడించింది.

ప్రస్తుతం సేవ్ ది టైగర్స్ 2 సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేధికగా స్ట్రీమింగ్ అవుతుంది. మీరు ఇప్పటి వరకు ఈ సిరీస్ ను చూసి ఉండకపోతే వెంటనే వెళ్లి ఇంట్లోనే కూర్చుని.. ఫ్యామిలీతో కలిసి చూసేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X