ఫిదా సినిమాలో భానుమతి పాత్రను వదులకున్న స్టార్ సింగర్.. ఎందుకో తెలుసా?
నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఫిదా మూవీ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా సాయి పల్లవి పేరు చెప్పిన, ఫిదా సినిమా పేరు చెప్పినా అందిరకీ గుర్తొచ్చేది... భానుమతి ఒక్కటే పీస్... రెండు కులాలు, రెండు మతాలు, బాడ్ కావ్ బొక్కలు ఇరగ్గొడ్త డైలాగ్ లే. అంత మంచి నాచురల్ డైలాగ్స్ తో తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాధించుకుంది హీరోయిన్ సాయి పల్లవి. ఇదే ఆమెకు మొదటి సినిమా అయినా అద్భుతంగా నటించి అందరి చేత ఆహా అనిపించుకుంది.
ముఖ్యంగా టాలీవుడ్ లో సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ను పెంచుకుంది. ఈ ఒక్క సినిమాతోనే లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. 2017లో జులై 21వ తేదీన విడుదల అయిన ఈ చిత్రాన్ని.. ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. ఇంతటి అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ శేఖర్ కమ్ములకు కూడా మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా 15 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా మొదటి వారంలోనే 40 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. అయితే ఇంత పెద్ద హిట్టుగా నిలిచిన ఈ సినిమాకు హీరోయిన్ గా ఫస్ట్ ఛాన్స్ సాయి పల్లవి కాదట.

ఈ సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ కు చెందిన ఓ టాప్ సింగర్ ను తీసుకోవాలని డైరెక్టర్ శేఖర్ కమ్ముల భావించారట. అందుకోసం ఆమె వద్దకు వెళ్లి అడిగారట కూడా. అయితే సినిమాల్లో చేయాలని ముఖ్యంగా ప్రధాన పాత్రల్లో కనిపించాలని ఆమెకు ఉన్నా.. హీరోయిన్ గా చేసేందుకు మాత్రం ఆమె ఒప్పుకోలేదట. ఇంత మంచి క్యారెక్టర్ ను వదులుకున్న ఈ స్టార్ సింగర్ ఎవరు, ఎందుకు వదులుకున్నారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ కు చెందిన సింగర్ మంగ్లీ గురించి అందరికీ తెలిసిందే. వీ6 ఛానెల్ లో వచ్చే తీర్మాన్ మల్లన్న ఛానెల్ తో విపరీతమైన క్రేజ్ సంపాధించుకున్న ఈమె ఆ తర్వాత మైక్ టీవీకి వెళ్లి బతుకుమ్మ స్పెషల్ పాటలు చేసింది. పాటలు పాడుతూనే వీడియోల్లో కూడా కనిపించి సింగర్ గా మారిపోయింది. ఇక ఆ తర్వాత నుంచి వరుసగా పాటలు పాడే అవకాశాలను దక్కించుకుంటూ టాప్ సింగర్ గా కొనసాగుతోంది. కేవలం పాటలు, వీడియో సాంగ్స్ మాత్రమే కాకుండా కొన్ని సినిమాల్లో కూడా నటించి మెప్పించిందీ ముద్దుగుమ్మ.

ముఖ్యంగా 2020లో ఊల్లాల ఊల్లాలా అనే సినిమాలోనూ, 2021లో మ్యాస్ట్రీ సినిమాలోనూ కనిపించింది. అయితే ఈమె టాలెంట్ గుర్తించిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల 2016లోనే ఈమెకు హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వాలని అనుకున్నారు. అయితే అప్పటికి మంగ్లీకి సినిమాల్లోనే చేయాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ.. హీరోయిన్ గా కనిపించాలని లేదట. అందుకే ఫిదా సినిమాలో భానుమతి క్యారెక్టర్ ను మిస్ చేసుకుందట. కానీ ఆ ఛాన్స్ సాయి పల్లవికి రావడం.. ఈ సినిమాతోనే ఆమెకు విపరీతమైన క్రేజ్ రావడంతో మంగ్లీ కాస్త ఫీలైందట. మరి భవిష్యత్తులోనూ ఇలాంటి అవకాశాలు వస్తే మంగ్లీ అందిపుచ్చుకుంటుందా లేదా అనేది చూడాలి.


Click it and Unblock the Notifications











