Devara: దేవర మూవీలో ఎన్టీఆర్ భార్యగా కనిపించిన నటి ఎవరో తెలుసా?

ఇంట్రెస్టింగ్ గా పలు చిత్రాలు ఆయా సినీ పరిశ్రమల్లో కొత్త కొత్త నటీనటుల్ని సర్ప్రైజింగ్ గా అందిస్తూ ఉంటాయి. అలా అంతకు ముందు ఎప్పుడూ ఆమె లేదా అతడిని చూడకపోయినా ఆ ఒక్క సినిమాతో మంచి గుర్తింపుని వారు తెచ్చుకుంటారు. అలా ఈ మధ్య హీరోయిన్స్ ఆ సినిమాలు రిలీజ్ అయ్యాక ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన వారు చాలా మందే ఉన్నారు.

కాగా ఈ లిస్ట్ లో అయితే ఆనిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రి పాన్ ఇండియా వైడ్ గా ఒక సెన్సేషన్ గా మారింది. ఇక తెలుగులో అయితే క్రేజీ థ్రిల్లర్ హిట్ చిత్రం "మంగళవారం" లో దివ్య పిళ్ళై అనే నటి కోసం చర్చ జరిగింది. కాగా ఇపుడు సరిగా ఇదే తరహాలో అంతా ఓ నటి కోసం మాట్లాడుకుంటున్నారు. ఆమె ఎవరో కాదు మ్యాన్ ఆఫ్ మాసెస్ లేటెస్ట్ భారీ చిత్రం "దేవర" లో ఎన్టీఆర్ కి జోడిగా కనిపించిన నటి శృతి మరాఠేనే..

do you know who played jr ntr wife role in devara shruthi marathe from north

కాగా ఈమె దేవర సినిమాలో దేవర రోల్ కి భార్యగా నటించింది. మెయిన్ హీరోయిన్ బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ అయినప్పటికీ ఈమె కోసం కూడా చాలా మంది మాట్లాడుకున్నారు. దేవర భార్యగా ఈమె చక్కగా కుదిరింది అని అందరి దృష్టిని ఈమె ఆకర్షించింది. కాగా ఈమెకి అక్షరాలా 37 ఏళ్ళు అట.. అంటే దాదాపు ఎన్టీఆర్ తో కేవలం కొన్నేళ్ల డిఫరెన్స్ మాత్రమే అని చెప్పాలి.

అలాగే ఈమె నిజానికి ఒక మరాఠీ నటి కాగా ఈమె జన్మించింది గుజరాత్ లో అట. అలా మరాఠీలోనే మొదటిగా నటిగా పరిచయం కాగా ఈమె మోడల్ గా కూడా వర్క్ చేసిందట. అంతే కాకుండా ఈమెకి సౌత్ లో దేవర ఏమి మొదటి సినిమా కాదట. ఆల్రెడీ తమిళ్ లో పలు చిత్రాలు ఈమె చేసింది. ఇందిరావిజి, గురు శిష్యన్, అరవన్, నాంగ రొంబ బిజీ అనే చిత్రాల్లో ఈమె ఆల్రెడీ సౌత్ లో పలు చిత్రాల్లో నటించింది.

do you know who played jr ntr wife role in devara shruthi marathe from north

కానీ ఫైనల్ గా కొరటాల కంట్లో పడి "దేవర" తో మొట్ట మొదటిసారిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇలా ఇవ్వడంతోనే శృతి మరాఠే అందరి దృష్టిని ఆకర్షించింది. మరి చూడాలి ముందు రోజుల్లో అయితే ఏమన్నా ఈమె తెలుగులో మరిన్ని సినిమాల్లో కనిపిస్తుందో లేదో అనేది. ఇక ప్రస్తుతం దేవర 1 లో కనిపించగా దేవర పార్ట్ 2 లో కూడా ఈమె తప్పకుండా కనిపించే ఛాన్స్ ఉంది.

ఇంకా ఈమెపై మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈమె హిందీలో భారీ హిట్ అయ్యిన హారర్ కామెడీ చిత్రం "ముంజ్యా" లో కూడా ఈమె నటించింది. ఇలా శృతి మరాఠే అయితే తెలుగు సహా తమిళ్, ఇంకా హిందీ మరియు మరాఠే భాషల్లో నటిస్తూ బిజీగా ఉంది.. హోప్ ఫ్యూచర్ లో మరిన్ని సినిమాల్లో కనిపించాలని ఆశిద్దాం.

More from Filmibeat

Read more about: jr ntr devara shruthi marathe
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X