Manchu Manoj: మంచు మనోజ్‌తో పెళ్లికి నో చెప్పిన అలనాటి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎవరు, ఎందుకో తెలుసా?

టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ గురించి అందరికీ తెలిసిందే. నటప్రపూర్ణ మంచు మోహన్ బాబు కుమారుడిగా... బాల నటుడిగానే సినీ రంగంలో అడుగు పెట్టిన ఈయన ఆ తర్వాత హీరోగా మారాడు. అదిరిపోయే సినిమాలు తీసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. అయితే ఈయనను పెళ్లి చేసుకోమని.. అలనాటి చైల్డ్ ఆర్టిస్ట్ ను నేరుగా మంచు మోహన్ బాబుయే వెళ్లి అడిగారట. కానీ ఆమె మాత్రం మంచు మనోజ్ ను పెళ్లి చేసుకోలేనని సూటిగా చెప్పేసిందిట. అయితే ఆ నటి ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మేజర్ చంద్రకాంత్ సినిమాతో 1993లో సినీ రంగంలో అడుగు పెట్టాడు మంచు మనోజ్. 2004లో దొంగ దొంగది సినిమాతో హీరోగా మారి తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత నుంచి హీరోగా చాలా కాలం పాటు మంచి మంచి సినిమాలు చేసిన ఈయన 2015లో ప్రణతి రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. కానీ ఈ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. 2019లోనే వీరిద్దరూ మనస్పర్ధల వల్ల విడాకులు తీసుకున్నారు. ఇక ఆ తర్వాత భూమా మౌనిక ప్రేమలో పడ్డ మంచు మనోజ్.. గతేడాదే ఈమెను పెళ్లి చేసుకున్నారు.

Do You Know Who Rejected Manchu Manoj Marriage Proposal

ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కాగా చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా మౌనికకు మొదటి భర్తతో పుట్టిన బాబును తన సొంత కొడుకులా చెప్పుకుంటున్న మనోజ్.. ఇటీవలే తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం మౌనిక 7 నెలల గర్భవతి. ఇంత హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న ఈయన ఉస్తాద్ అనే షో కూడా చేస్తూ కెరియర్ లోనూ ముందుకు వెళ్తున్నాడు. అయితే ఈయనకు పెళ్లి వయసు రాగానే మంచు మోహన్ బాబుయే వెళ్లి ఓ అమ్మాయిని తన కొడుకును పెళ్లి చేసుకోవాలని అడిగారట.

ముఖ్యంగా మేజర్ చంద్రకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన నటి శ్రేష్ఠను.. మంచు మనోజ్ ను పెళ్లి చేసుకోమని కోరారట. నేరుగా వాళ్ల ఇంటికి వెళ్లి అడిగినా ఆమె నో చెప్పిందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి శ్రేష్ఠం ఈ విషయం గురించి చెప్పింది. అయితే యాంకర్ మంచు మనోజ్ కు నో చెప్పారట ఆ విషయం ఏంటని అడగ్గా.. వద్దు వద్దంటూనే అసలు విషయం చెప్పింది శ్రేష్ఠ. అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసిన ఈమె ఆ తర్వాత యూఎస్ వెళ్లిపోయి అక్కడే చదువుకున్నట్లు తెలిపింది.

Do You Know Who Rejected Manchu Manoj Marriage Proposal

అయితే హైదరాబాద్ ను మిస్ అవుతున్నట్లు అనిపించగా... పూర్తిగా ఇక్కడే సెలిట్ అవ్వాలని వచ్చేసినట్లు చెప్పింది. చాలానే సంబంధాలు వస్తున్నా ఎక్కువగా యూఎస్ కు సంబంధించినవి ఉన్నాయని రిజెక్ట్ చేస్తున్నట్లు వివిరంచింది. అలాగే గతంలో మంచు మనోజ్ కు నో చెప్పిన విషయంపై కూడా క్లారిటీ ఇచ్చింది. అయితే ఎందుకు అతడికి నో చెప్పిందనేదానికి మాత్రం నటి శ్రేష్ఠ సమాధానం చెప్పలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X