జూన్ 27 తేదీనే కల్కి ఎందుకు విడుదల? ప్రభాస్ సినిమా రిలీజ్ వెనుక ఇంత స్టోరి ఉందా? ఆస్ట్రాలజీ చెప్పిందేమిటి?
సాధారణంగా సినిమాలను ప్రతి శుక్రవారం విడుదల చేస్తారు. దీని వెనక పెద్దగా కారణాలు ఏమీ లేకపోయినప్పటికీ శుక్రవారం విడుదల చేస్తే వీకెండ్ కూడా కలిసి వస్తుంది అన్న ఉద్దేశంతో ఎప్పటి నుంచో ఇదే ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు నిర్మాతలు. అయితే పండగలను బట్టి, ఇతర కారణాలను బట్టి కొన్నిసార్లు వీక్ మధ్యలో కూడా సినిమాలను రిలీజ్ చేస్తూ ఉంటారు. తాజాగా కల్కి 2898 ఏడి మూవీని జూన్ 27న రిలీజ్ చేయడం వెనక కారణం ఏంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. శుక్రవారం కాకుండా ఈ మూవీని గురువారం ఎందుకు రిలీజ్ చేశారు అనే విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన మాగ్నమ్ ఓపస్ కల్కి 2898 ఏడి. జూన్ 27న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే కల్కి మూవీ శుక్రవారం కాకుండా గురువారం రిలీజ్ కావడం వెనక కారణం ఏంటని ఆరా తీయడం మొదలుపెట్టారు ఆయన అభిమానులు. దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ భారీ బడ్జెట్ మూవీ భారతీయ పురాణాల ఆధారంగా తెరకెక్కించారు.

29వ శతాబ్దంలో భవిష్యత్తు ప్రపంచాన్ని, అలాగే శ్రీ మహావిష్ణువు పదవ అవతారమైన కల్కి రాకను తెరపై చూపించారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సినిమా విడుదల తేదికి, మహాభారతానికి సంబంధం ఉండడం. నిజానికి కల్కి మూవీ మేలోనే రిలీజ్ కావలసి ఉండగా, లోక్ సభ ఎన్నికల కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.
అయితే సాధారణంగా సినిమాలను రిలీజ్ చేసే విధంగా శుక్రవారం కాకుండా గురువారమే ఎందుకు రిలీజ్ చేశారు అని చాలా మంది ఆశ్చర్యపోయారు. అసలు దీని వెనక కారణం ఏంటి అని ఆరా తీస్తే తెలిసిన విషయం ఏమిటంటే న్యూమరాలజీ. 2898 సంవత్సరం అనేది ఈ సినిమాలో చాలా ముఖ్యమైనది. అయితే ఈ 2898 లోని అంకెలు అన్నింటిని కలిపితే మొత్తం 27 అవుతుంది. అంటే ఇది 27వ తేదీకి కరెక్ట్ గా సరిపోతుంది.
నిజానికి చిత్ర నిర్మాతలు జూన్ 27న మూవీని ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అనే విషయాన్ని వివరించలేదు. కానీ ఇది హిందూ క్యాలెండర్ కు సంబంధించిన విషయమని పలువురు జ్యోతిష్యులు భావిస్తున్నారు. విక్రమ్, శక క్యాలెండర్ల ప్రకారం 2024 జూన్ చివర్లో ఆషాడ మాసం స్టార్ట్ అవుతుంది. జూన్ 23న ప్రారంభమై జూలై 21 తో ముగుస్తుంది.

ఈ ఏడాది కృష్ణపక్షం 13 రోజులే ఉంటుంది. కానీ సాధారణంగా కృష్ణ పక్షం అంటే 15 రోజులు ఉంటుంది. అయితే ఈ సంవత్సరం వచ్చిన కృష్ణపక్షం చాలా అరుదు. మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర యుద్ధం జరిగిన సమయంలో అంటే 5000 ఏళ్ల క్రితం వచ్చింది. ఇన్నేళ్ల తరువాత ఆషాడం ఈ అసాధారణ కృష్ణపక్షం ఆరవ రోజున వస్తుంది. అందుకే కల్కి రిలీజ్ కు ఆరో నెలను ఎంచుకున్నారని టాక్ నడుస్తోంది. మొత్తానికి ఈ రెండు కారణాలవల్లే ఆరవ నెల 27వ తేదీన కల్కి మూవీని థియేటర్లలోకి దించారని అంటున్నారు.


Click it and Unblock the Notifications











