Upasana Konidela: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఉపాసనే ప్రేమలో పడొద్దంటోంది.. చెర్రీయే కారణం అంట!

గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ గురించి, ఆయన భార్య ఉపాసన కొణిదెల గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యామిలీ కోడలిగా.. ఇంటి బాధ్యతలు చూసుకోవడంతో పాటు కామినేని హాస్పిటల్స్ బాధ్యతలను కూడా చక్కగా చూసుకుంటున్న ఉపాసన ప్రేమ గురించి షాకింగ్ కామెంట్లు చేసింది. ముఖ్యంగా రామ్ చరణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె.. ఎవరూ ప్రేమలో పడొద్దని అంటుంది. అందుకు కారణం చెర్రీయే అని కూడా వివరిస్తోంది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

RRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయి.. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. కెరియర్ పరంగా అద్భుతమైన సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న ఇతడు.. పర్సనల్ లైఫ్ లో కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. 2012లో జూన్ 14వ తేదీన ఉపాసనను ప్రేమించి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. అయితే వీరిద్దరికీ పెళ్లి జరిగిన తర్వాత చాలా మంది వీరిని ట్రోలింగ్ చేశారు. ముఖ్యంగా ఉపాసన అందంపై విపరీతమైన కామెంట్లు వచ్చాయి.

Do you know why Upasana Konidela says that no one should fall in love?

కానీ వాటేమిటినీ వీళ్లు పట్టించుకోకుండా చాలా సంతోషంగా జీవిస్తున్నారు. ఇద్దరూ కెరియర్ లో బాగా సెటిల్ అవుతూనే.. తమకు స్పెషల్ గా సమయం కేటాయించుకున్నారు. ఇలా పదకొండేళ్ల తర్వాత ఈ జంట ఓ పండంటి ఆడబిడ్డకు జన్మను ఇచ్చింది. మెగా వారసురాలు అయిన ఆ పాపకు క్లింకారా కొణిదెల అనే పేరును పెట్టినట్లు కూడా వివరించారు. అయితే మెగా ఫ్యామిలీ మొత్తాన్ని ఇంటి పెద్ద కోడలిగా ఒక్కతాటిపై నడిపిస్తోంది ఉపాసన.

అంతేకాకుండా అపోలో హాస్పిటల్స్ బాధ్యత కూడా తీసుకుని తన భుజాలపై వేసుకుంది. ఇలా ఎన్నెన్నో మంచి పనులు చేస్తూ అటు పుట్టినింటి, ఇటు మెట్టినింటి గౌరవం కాపాడుకుంటూ వస్తుంది. అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. తల్లిగా అయ్యాకా.. తనకు కాస్త బాధ్యతలు పెరిగాయని కానీ వాటన్నిటినీ తాను చూసుకోగల్గుతున్నాని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాము చాలా సంతోషంగా ఉన్నామని వెల్లడించింది.

Do you know why Upasana Konidela says that no one should fall in love?

అయితే చెర్రీని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మకు రామ్ చరణ్ యే ప్రేమలో పడకూడదని చెప్పాడట. తనకు కూడా అది నిజమే కదా అనిపించదట. ఎందుకంటే ప్రేమలో పడడం సరికాదని.. ప్రేమలో ఇద్దరూ కలిసి ఎదగాలని చెప్పారట. అలా ప్రేమను పెంచుకుంటూ వెళ్తే వారి జీవితాలు చాలా బాగుంటాయని చెప్పారట. ఇలా ఒకరికొకరు అన్ని విషయాల్లో సహకారం చేసుకుంటూ ముందుకు వెళ్లడమే ప్రేమకు అసలైన నిర్వచనం అంటూ వివరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X