అడల్ట్ స్టార్స్‌కు ఉన్న గుర్తింపు సైంటిస్టులకు లేదు.. మహిషాసురుడు హీరో, డాక్టర్ గురు ప్రసాద్ ఆవేదన

అనిరుధ్, అపరాజిత సమర్పణలో శ్రీ శివరామ ఆర్ట్స్ పతాకంపై ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎస్.గురుప్రసాద్ ప్రధాన పాత్రలో వినోద్, రిచా కర్లా, ధరణి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం మహిషాసురుడు.

రవికుమార్ గోనుగుంట దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో బుధవారం హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదలైంది ముఖ్య అతిధులుగా విచ్చేసిన సినీ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ, తనికెళ్ళ భరణి, రేలంగి నరసింహారావు, గౌతం రాజులు సంయుక్తంగా ఆడియోను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఈ సినిమా గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ గురు ప్రసాద్ మాట్లాడుతూ..

కోటి రూపాయల డివైస్ 5 లక్షలకే: ఒక 13 ఏళ్ల అమ్మాయికి గుండె మార్పిడి చేయాల్సి వచ్చింది. బ్లడ్ గ్రూప్స్, గుండె మ్యాచ్ అవ్వాలి. ఆస్ట్రేలియా నుంచి తెప్పించాల్సి వచ్చింది. పేషెంట్ బతకాలంటే.. ఒక డివైస్ కావాలి. రొబోటిక్ హార్ట్ పెట్టాలి. ఒక గుండె మార్పిడి చేయాలంటే కనీసం కోటి రూపాయలు ఖర్చు అవుతుంది.

చెన్నైలో ఆరుగురు పేషెంట్లకు అలాంటి ఖరీదైన హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశాం. కోటి రూపాయల డివైస్‌ను చూసి.. 5 లక్షలు ఇవ్వండి. ఐదేళ్లు బతికేలా డివైస్ తయారు చేసి ఇస్తాం అని హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్‌లో పనిచేసే నా ఫ్యామిలీ మెంబర్స్ అన్నారు.

Doctor and Cardiologist Guru Prasad speech at Mahishasurudu movie Audio release

నేను ఎవరో మీకు తెలియదు: మహిషాసురుడు సినిమా తీశానంటే మీరు వచ్చారు. కానీ నేను రీసెర్చ్ తీసి హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ డివైస్ తీశానంటే మీరు రారు. గూగుల్‌లో నా ప్రొఫైల్ కొట్టి చూడండి.. వందల కొద్ది రీసెర్చ్ చేశాను. కానీ నేను ఎవరో తెలియదు. నేను మీకు యాక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా మాత్రమే తెలుసు. ఎందుకంటే నేను సినిమా తీశాను కాబట్టి ఆ మాత్రం నేను తెలుసు అన్నాడు.

Doctor and Cardiologist Guru Prasad speech at Mahishasurudu movie Audio release

సైంటిస్టులను ఎవరూ పట్టించుకోరు: మీరు వేసుకొనే బీపీ ట్యాబ్లెట్స్‌ మేము రీసెర్చ్ చేసిందే. మా గైడ్ లైన్స్ ప్రకారమే ఆ ట్యాబ్లెట్లు తయారు చేశారు. కోవిడ్ తర్వాత పేషెంట్లకు ఏమౌతుందనే రీసెర్చ్ మేమే చేశాం. ఇవన్నీ ఎవరు పట్టించుకొన్నాను. ఈ దేశంలో సినీ తారలు, స్పోర్ట్స్‌మెన్స్, అడల్ట్ స్టార్స్‌కు ఉన్న గుర్తింపు సైటింస్టులకు లేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Doctor and Cardiologist Guru Prasad speech at Mahishasurudu movie Audio release

ఇండియాలో తయారు చేయలేమా?: మనదేశంలో ఉన్న సైంటిస్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. సైంటిస్లు విదేశాలకు పారిపోకుండా చూసుకోవాలి. ప్రతీ ఒక్కరు ఫారిన్ స్టెంట్ వేస్తారా? ఆస్ట్రేలియా స్టెంట్ వేస్తారా అని అడుగుతుంటారు. ఇండియాలో తయారు చేయలేమా? మేకిన్ ఇండియా అంటారు. తక్కువ ఖర్చుతో స్టెంట్స్ వేయలేమా. నెల్లూరు చాపల పులుసు, ఇండియన్ ఫుడ్ కావాలి.. కానీ ఆరోగ్యానికి మాత్రం విదేశాల్లో తయారు చేసినవి కావాలి. ఇలాంటివన్నీ చూసి నాలో కలిగిన ఆవేశంతో సినిమా చేశాను అని అన్నారు.

Doctor and Cardiologist Guru Prasad speech at Mahishasurudu movie Audio release

ఇలాంటి సినిమాలే తీస్తాను అంటూ: నాకు నచ్చిన వ్యక్తి భగత్ సింగ్. భారత్ కోసం ఏమైనా చేస్తాననే భావన నాలో ఉంది. అలాంటి ఆవేశంతోనే మహిషాసురుడు సినిమా తీశాను. నేను యాక్టర్‌గా ఉండాలనుకోవడం లేదు. డాక్టర్‌గానే ఉంటాను. నేను తీసిన సినిమా చూస్తే చాలూ నాకు ఓ స్పూర్తి కలుగుతుంది. భవిష్యత్‌లో సినిమాలు తీస్తే.. ఇలాంటి సినిమాలే తీస్తాను. నచ్చినా నచ్చకపోయినా ఇలాంటి సినిమాలే తీస్తాను. కంటెంట్, ఎమోషన్స్ ఉండే సినిమా చేస్తాను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X