twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    The Wrong Swipe తొలి చిత్రంతోనే సత్తా చాటిన డాక్టర్ రవికిరణ్ రెడ్డి

    |

    తాము డాక్టర్ కావాలనుకొని యాక్టర్ అయ్యాం.. లేదా యాక్టర్ కాబోయి డాక్టర్ అయ్యాం మని సాధారణంగా పలు సందర్భాల్లో ఆర్టిస్టులు చెబుతుంటారు. వెండితెర మీద రాణిస్తున్న డాక్టర్ రాజశేఖర్ లాంటి ఎంతో మందిని స్పూర్తిగా తీసుకొని వెండితెరపైన తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ఓ డాక్టర్ సిద్దమయ్యారు. ఎంతోమంది షుగర్ పేషెంట్లకు ఉపశమనం కలిగిస్తున వైద్యుడు రవికిరణ్ ఇప్పుడు డైరెక్టర్‌గా మారారు. తన తొలి చిత్రంతోనే తెలుగు సినిమా పరిశ్రమలోని ఎంతో మంది టాప్ డైరెక్టర్ల ప్రశంసలు అందుకొంటున్నారు. One Plus 6T మొబైల్ ఫోన్‌తో తీసిన తన తొలి చిత్రం ది రాంగ్ స్వైప్ అనే చిత్రం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారింది. ఈ సినిమా వివరాల్లోకి వెళితే..

    తన సహచర డాక్టర్లు, స్నేహితుల సహకారంతో పరిమిత బడ్జెట్, వారాంతంలో షూటింగ్ చేసి ది రాంగ్ స్వైప్ చిత్రాన్ని డాక్టర్ రవికిరణ్ గడాల రూపొందించారు. ఈ యువ ప్రతిభాకిరణం రూపొందించిన చిత్రానికి మంచి ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ సినిమా తర్వాత పలు అవకాశాలు రవికిరణ్ గడాల తలుపు తడుతున్నాయి. అయితే తొందరపాటు ప్రదర్శించకుండా మంచి కథల కోసం ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. అయితే ది రాంగ్ స్వైప్ చిత్రం ద్వారా ఏకంగా ముగ్గురు డాక్టర్లు టాలీవుడ్‌కు పరిచయం కావడం విశేషంగా మారింది. ఈ చిత్ర నిర్మాణంలో నిర్మాత డాక్టర్ ప్రతిమారెడ్డి, హీరో డాక్టర్ ఉదయ్ రెడ్డి, డైరెక్టర్ రవికిరణ్ రెడ్డి పాలు పంచుకొన్నారు. తొలి చిత్రం అందించిన ఉత్సాహంతో టాలీవుడ్‌లో విభిన్నమైన చిత్రాలను అందించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు డాక్టర్ ప్రతిమారెడ్డి, హీరో డాక్టర్ ఉదయ్ రెడ్డి, డైరెక్టర్ రవికిరణ్ రెడ్డి తెలిపారు.

     Doctor Ravikiran Reddy gets hug applause for The Wrong Swipe

    ది రాంగ్ స్వైప్ చిత్రాన్ని ఇటీవల కొందరు సినీ ప్రముఖులకు చూపించడం జరిగింది. సుప్రసిద్ధ దర్శకులు కోదండరామిరెడ్డి, ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సోనీ లివ్ హెడ్ మధుర శ్రీధర్ రెడ్డి, ఊర్వశి సారథులు రవి కనగాల- తుమ్మలపల్లి రామసత్యనారాయణ ది రాంగ్ స్వైప్ చూశారు. ఈ సినిమా చూసిన తర్వాత తమపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల కాలంలో తాము చూసిన మంచి చిత్రాల్లో ఒకటి అని చెప్పడం మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఈ చిత్రంలోని ప్రతీ సన్నివేశం ఆద్యంత ఆసక్తిని కలిగించేలా ఉందని చెప్పడం మాలో మరింత నమ్మకం పెరిగింది అని డాక్టర్ రవికిరణ్ చెప్పారు.

     Doctor Ravikiran Reddy gets hug applause for The Wrong Swipe

    డాక్టర్ రవికిరణ్ గడాల విషయానికి వస్తే.. వైద్యవృత్తి నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. తల్లిదండ్రులిద్దరూ వైద్యులే కావడం విశేషం. చిన్నతనంలో తన వైద్య వృత్తిలో విశేషమైన అనుభవం, పేరు సంపాదించిన రవికిరణ్ ఇప్పుడు టాలీవుడ్‌లో రాణించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తన తదుపరి చిత్రంగా 6 MP అనే చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. వృత్తిపరంగా షుగర్ పేషెంట్లకు చికిత్స అందిస్తూనే.. ప్రవృత్తిపరంగా ఫీల్‌గుడ్ చిత్రాలను అందించే ప్రయత్నం చేయడాన్ని ప్రతీ ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ రవికిరణ్ సినిమారంగం నుంచి కూడా డాక్టరేట్ సాధించేంత సక్సెస్ కావాలని మనసారా కోరుకుందాం!!

    English summary
    Doctor Ravikiran Reddy turns as Director in tollywood. His maiden project The Wrong Swipe gets good response. A Kodanda Ramireddy appreciates The Wrong Swipe
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X