Jr NTR's Adhurs : భట్టు- చారీల మేజిక్ .. వృద్ధురాలి ప్రాణం నిలబెట్టిన అదుర్స్
భారతదేశంలో కాలక్షేపానికి ఎన్నో మాధ్యమాలు అందుబాటులో ఉన్నాయి. కానీ వీటిలో సినిమా స్థానం వేరు. వినోదంతో పాటు సామాజిక స్పృహను కూడా సినిమాలు అందిస్తున్నాయి. కొన్ని సినిమాలు ఎందరికో స్పూర్తిగా నిలిచి వారు జీవితంలో ఎదిగేందుకు తోడ్పాటును కూడా అందించిన దాఖలాలు ఉన్నాయి. తాజాగా ఓ సినిమా ఏకంగా వృద్ధురాలి ప్రాణాలే నిలబెట్టింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ తొలినాళ్ల నుంచి ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. వీటిలో వేటికవే ప్రత్యేకం . మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌లతో పాటు లవర్ బాయ్‌గానూ మెప్పించారు జూనియర్. అన్నింటిలోకి వీవీ వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అదుర్స్ సినిమా ఆయన కెరీర్‌లోనే ప్రత్యేకంగా నిలిచింది. బ్రాహ్మణుడి గెటప్‌లో ఎన్టీఆర్ అలరించారు. ముఖ్యంగా బ్రాహ్మనందంతో కలిసి ఆయన చేసిన కామెడీ నవ్వులు పూయిస్తుంది.

భట్టు చారి అనే గురు శిష్యులుగా బ్రాహ్మానందం- ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. ఇప్పటికీ ఈ సినిమాలోని డైలాగ్స్ , కామెడీ సీన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మీమర్స్ ఈ సినిమాలోని సీన్స్, ఎక్స్‌ప్రెషన్స్‌ను తీసుకుని మీమ్స్ క్రియేట్ చేసి వదులుతున్నారు. నయనతార, రమాప్రభలు కూడా తమ వంతు పాత్ర పోషించడంతో అదుర్స్ సినిమా సూపర్‌హిట్ అయ్యింది. ఎన్నిసార్లు చూసినా ఇప్పటికీ ఫ్రెష్‌గానే ఉంటుంది.
అలాంటి అదుర్స్‌కి సీక్వెల్ రావాలని ఫ్యాన్స్ ఏళ్లుగా కోరుకుంటున్నారు. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ.. అదుర్స్-2పై కీలక వ్యాఖ్యలు చేశారు. సీక్వెల్ చేస్తే ఎన్టీఆర్ మాత్రమే చేయాలని, ఆ గెటప్ ఆయనకు తప్పించి ఎవరికీ సూట్ అవదని కోన అన్నారు. అదుర్స్ -2 పాన్ వరల్డ్ మూవీ అని, సేమ్ అదుర్స్ టీమ్ ఉంటుందని చెప్పారు. అప్పట్లో ఈ వార్తలు సంచలనం సృష్టించగా.. ఇప్పుడంతా ఎన్టీఆర్ దేవర కోసం వెయిట్ చేస్తున్నారు.

అలాంటి అదుర్స్ సినిమా ఓ వృద్ధురాలి ప్రాణం నిలబెట్టింది. సాధారణంగా డాక్టర్లు ఎవరికైనా సర్జరీ చేయాల్సి వస్తే నొప్పి భరించలేరనే ఉద్దేశంతో మత్తు ఇంజెక్షన్ ఇస్తారు. కానీ కాకినాడలో ఓ వృద్ధురాలికి మెదడులో ఉన్న కణితిని తొలగించేందుకు సర్జరీ చేయాల్సి ఉండగా.. ఆ సమయంలో ఆమె టెన్షన్ పడకుండా ఉండేందుకు అదుర్స్ మూవీని చూపించారు. తొండంగి మండలానికి చెందిన 55 ఏళ్ల అనంత లక్ష్మీ అనే మహిళ గత కొన్నేళ్లుగా బ్రెయిన్ ట్యూమర్ సమస్యతో బాధపడుతున్నారు.
దీంతో ఆమెకు శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు నిర్ధారించారు. అయితే సర్జరీ సమయంలో బాధితురాలి నరాలు దెబ్బతినకుండా ఉండేందుకు గాను అదుర్స్ చూపించారు. ఆమె భట్టు, చారీల కామెడీ చూస్తూ ఎంజాయ్ చేస్తుండగా.. డాక్టర్ల తమ పని చేసుకుంటూ పోయారు. ఈ ఆపరేషన్ సక్సెస్ కాగా.. త్వరలోనే బాధితురాలు ఇంటికి వెళ్లనున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్‌ని ఎన్టీఆర్ అభిమానులు వైరల్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











