For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎరక్క పోయి ఇరుక్కున్న జక్కన్న.. ఒక రేంజ్ లో ఆడేసుకుంటున్నారుగా!

  |

  'బాహుబలి' సినిమాతో ఇండియన్ సినిమా ఖ్యాతిని ప్రపంచం అంతా చాటిన రాజమౌళి ప్రస్తుతం మరో భారీ బడ్జెట్ సినిమా అయిన ఆర్ ఆర్ ఆర్ సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దంగా ఉంది. అయితే తాజాగా జక్కన్న ఎరక్కపోయి ఒక వివాదంలో చిక్కుకున్నాడు. a వివరాల్లోకి వెళితే

  ఢిల్లీ ఎయిర్ పోర్ట్

  ఢిల్లీ ఎయిర్ పోర్ట్

  రాజమౌళి రెండు రోజుల క్రితం ఢిల్లీ విమానాశ్రయంలో ఉన్న పరిస్థితులు చూసి అసహనం వ్యక్తం చేశారు. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో కూడా కనీస వసతులు లేకపోవడం గురించి పేర్కొంటూ ఆయన తన అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తాను అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నానని పేర్కొన్న ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  కింద కూర్చుని

  కింద కూర్చుని

  ఆర్టీపీసీఆర్‌ పరీక్షల కోసం అవసరమైన అప్లికేషన్స్ ఇచ్చి వాటిలో తగిన సమాచారాన్ని నింపి ఇవ్వాలని అక్కడి సిబ్బంది చెప్పడంతో ఆ పత్రాలు నింపడం కోసం కొంత మంది ప్రయాణికులు అవస్థలు పడటం చూశానని రాజమౌళి చెప్పుకొచ్చారు. ఆ అప్లికేషన్ ఫామ్స్ నింపేందుకు అనువుగా డెస్క్ లు సరిపడా లేవని, దీంతో ప్రయాణికులు గోడల మీద పెట్టి, మరి కొందరు నేలపైనే కూర్చుని వాటిని పూర్తి చేసి ఇచ్చారని పేర్కొన్నారు.

  ఆ కుక్కలేమిట్రా బాబు

  ఆ కుక్కలేమిట్రా బాబు

  ఇక అక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉందని పేర్కొన్న అయన ఆ తరువాత ఎయిర్‌ పోర్ట్‌ నుంచి బయటకు రాగానే అక్కడ వీధి కుక్కల గురించి కూడా కామెంట్స్ చేశారు. 'ఓ ఇంటర్నేషనల్ ఎయిర్‌ పోర్ట్‌ నుంచి బయటకు రాగానే వాటిని చూస్తే విదేశీయులకు మన దేశంపై ఎలాంటి భావన కలుగుతుందో ఒకసారి ఆలోచించండని చెబుతూ ఆయన కామెంట్స్ చేశారు. దీనికి ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్‌ యాజమాన్యం కూడా స్పందించింది.

  ఎందుకీ కామెంట్స్

  ఎందుకీ కామెంట్స్

  అయితే ఇదే ఇప్పుడు ఆయనను టార్గెట్ అయ్యేలా చేసింది. ఈ అంశం మీద జక్కన్నని మూగజీవాల ప్రేమికులు టార్గెట్ చేస్తున్నారు. రాజమౌళి బహిరంగ వేదికలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని జంతు కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. జంతువులపై ఇలాంటి బాధ్యతా రహితమైన మరియు స్పృహలేని వ్యాఖ్యలను చేసినందుకు ఆయన క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

  Gatham Director Kiran Reddy About Cinematography అద్భుతమైన కెమెరా వర్క్, అమేజింగ్ విజువల్స్...!!
  చాలా ఉన్నాయి

  చాలా ఉన్నాయి

  ముందు ఈ అంశం మీద పెద్ద రచ్చ జరగకపోయినా ఇప్పుడు జంతు ప్రేమికులు టార్గెట్ చేయడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా రాజమౌళి తన స్టేట్మెంట్ల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు. గుంటూరుకు చెందిన జంతు హక్కుల కార్యకర్త ఒకరు జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఈ దేశాన్ని విదేశీయులకు 'ప్రెజెంట్' చేసే ముందు, మార్చవలసిన అనేక విషయాలు ఉన్నాయని అన్నారు. వీధి కుక్కలు అక్కడ సమస్య కాదని, రాజమౌళి వంటి ప్రముఖ వ్యక్తులు ఇలాంటి లూజ్ కామెంట్స్ చేయడం కంటే ముందు అది తెలుసుకోవాలని పేర్కొన్నారు.

  English summary
  SS Rajamouli has landed in controversy for his recent tweets. a couple of days back, Rajamouli slammed the authorities of the Delhi Airport for two reasons. now animal rights activists targets Rajamouli for the same.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X