బాహుబలిగా మారిన ట్రంప్.. నేనూ అందుకోసం ఎదురుచూస్తున్నా.. అధ్యక్షుడి ట్వీట్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇండియా పర్యటకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇలాంటి వేళా ప్రపంచ దేశాల కళ్లన్నీ మనవైపే ఉంటాయి. ప్రపంచలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ, శక్తివంతమైన దేశం.. అత్యంత వేగంగా ఎదుగుతూ, ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తున్న దేశం చర్చలు జరుపుతుంటే సాధారణంగానే మిగతా దేశాల మనవైపు చూస్తుంటాయి. ఈ క్రమంలో ట్రంప్ రాకపై తన అభిమానాన్ని చాటుకున్నాడు.

బాహుబలి ప్రభంజనం..
బాహుబలి సినిమా సృష్టించిన ప్రభంజనం.. అది ప్రేక్షకులపై చూపెట్టిన ప్రభావం ఇన్ని రోజులైనా ఏ మాత్రం తగ్గలేదు. సాహో రే బాహుబలి పాటలోని ప్రభాస్‌ను డోనాల్డ్ ట్రంప్‌గా చిత్రీకరించి చేసిన ఓ వీడియో విపరీతంగా వైరల్ అయింది. చివరకు తిరిగితిరిగి ఆ వీడియో అధ్యక్షుడి కంట్లో పడింది.

ట్రంప్ రాకను ఇలా..
భారత దేశాన్ని దర్శించేందుకు వస్తున్న ట్రంప్ రాక సందర్భంగా.. నా మనసులో ఎలాంటి వచ్చిన ఆలోచనలను ఈ వీడియో రూపంలో తీసుకొచ్చాను.. ఇండియా-అమెరికా ఐకమత్యంగా ఉండాలి అంటూ బాహుబలిగా డోనాల్డ్ ట్రంప్‌ను చూపెట్టాడు.
ట్వీట్ చేసిన డోనాల్డ్ ట్రంప్..
ఈ వీడియోను చూసిన డోనాల్డ్ ట్రంప్ తెగ ముచ్చట పడ్టట్లు తెలుస్తోంది. భారతదేశంలో ఉన్న నా స్నేహితులను కలుసుకునేందుకు నేను ఎదురుచూస్తున్నాను అంటూ ఓ ట్వీట్ చేశాడు. మొత్తానికి ఇలా బాహుబలి మరోసారి అందరి నోళ్లలో నానుతోంది.

నిన్ననే ఇంకో ట్వీట్..
స్వలింగ సంపర్క కథాంశంతో వచ్చిన శుభ్‌మంగళ్ జ్యాదా సావధాన్ చిత్రం గురించి తాత్చేల్ (ఎల్‌జీబీటీ హక్కుల కోసం పోరాడే వ్యక్తి) ఓ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు ట్రంప్ స్పందిస్తూ.. గ్రేట్ అంటూ మన చిత్రాన్ని పొగిడేశాడు.


Click it and Unblock the Notifications











