నా ప్రేమ కూడా ఓ ఉద్యమమే.. ఇంట్రస్టింగ్‌గా దొరసాని ట్రైలర్

విజయ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ, జీవిత రాజశేఖర్ దంపతులు కుమార్తె శివాత్మిక రాజశేఖర్ జంటగా నటించిన దొరసాని సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం కేవీఆర్ మహేంద్ర. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు, మధుర ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మధుర శ్రీధర్, బిగ్‌బెన్ బ్యానర్‌పై యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించారు. ధిరజ్ మొగిలినేని సహ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు.

పీరియడ్ ఫిలింగా రూపొందిన దొరసాని చిత్రం ట్రైలర్‌ పరంగా ఆకట్టుకొన్నది. 1980 నాటి కాల పరిస్థితులను చక్కగా తెరకెక్కించారనే ఫిలింగ్‌ను దర్శకుడు మహేంద్ర కలిగించాడు. ఇక ట్రైలర్‌లో భావోద్వేగమైన అంశాలు ఆసక్తిని రేపాయి. సంపన్న వర్గానికి చెందిన హీరోయిన్.. తక్కువ కులానికి చెందిన హీరోకు చెంబుతో నీళ్లు ఇస్తే తాగొచ్చా అనే డైలాగ్, సీన్ సినిమా ఇంటెన్సిటీని తెలిపింది. అలాగే జైలులో నక్సలైట్‌తో నా ప్రేమ కూడా ఓ ఉద్యమమే అని చెప్పడం మరింత క్యూరియాసిటీని పెంచింది. ఎమోషన్స్, యాక్షన్‌ను సమపాళ్లలో కలిపి తెరకెక్కించారా అనే ఫీలింగ్ కలిగించింది దొరసాని ట్రైలర్.

Dorasaani Theatrical Trailer review

నటీనటులు: ఆనంద్ దేవరకొండ, శివాత్మక రాజశేఖర్, కన్నడ కిషోర్, వినయ్ వర్మ, శరణ్య, బైరెడ్డి వంశీ కృష్ణ తదితరులు
దర్శకత్వం: కేవీఆర్ మహేంద్ర
నిర్మాతలు: సురేష్ బాబు, పై మధుర శ్రీధర్, యష్ రంగినేని

బ్యానర్‌: సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌, మధుర ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌, బిగ్‌బెన్ బ్యానర్‌
సంగీతం: ప్రశాంత్ విహారి
సినిమాటోగ్రఫి: సన్ని కూరపాటి
ఎడిటర్: నవీన్ నూలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X