కాజల్ క్యారెక్టర్‌పై అనుమానం.. అక్కడిదాకా వెళ్ళింది.. ఈ రచ్చ దేనికి దారితీస్తుందో మరి!
తనను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్ తేజ ద్వారానే తనలోని మరోకోణం బయటపెట్ట బోతోంది కాజల్ అగర్వాల్. సీత సినిమాలో మోడ్రెన్ సీతగా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో చిత్రంలో కాజల్ క్యారెక్టర్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం.

ఏమాత్రం తేడా కొట్టినా
దేవుళ్ళు, పురాణాలు, మతాల జోలికి వెళ్లే సినిమాల పట్ల చాలా జాగ్రత్త అవసరం. అయితే డైరెక్టర్ తేజ పురాణాన్ని, అందులోని అంశాలను తన పాయింట్ గా ఎంచుకోనప్పటికీ సమస్యలు తలెత్తుతున్నాయి. దీనికి కారణం సీత అనే క్యారెక్టర్ నేమ్ మాత్రమే. నేటితరం అమ్మయిల తీరును చూపించే ప్రయత్నం చేస్తున్న తేజ ఆ క్యారెక్టర్ పేరు మాత్రం సీతగా ఎంచుకోవడమే అభ్యంతరం వ్యక్తం చేయడానికి కారణం అవుతోంది. ఆ క్యారెక్టర్ విషయంలో ఏమాత్రం తేడా కొట్టినా ఇక అంతే మరి.

ట్రైలర్ చూసే..
సీత ట్రైలర్‌లో కాజల్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్‌గా చూపించారు. బెల్లంకొండ శ్రీనివాస్ ఫైట్ సీన్‌తో మొదలైన సీత ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ‘కొట్టు నన్ను కొట్టు.. దమ్ముంటే కొట్టు' అని విలన్‌తో కాజల్ చెప్పిన డైలాగ్ సీత పవర్ ఏంటో చెప్పేసింది. ఆసక్తికరమైన ఈ ట్రైలర్ విశేష స్పందన తెచ్చుకుంటోంది. అయితే ఈ ట్రైలర్ చూసిన కొందరు మాత్రం అభ్యంతరం తెలుపుతున్నారు.

సీతను అడ్డుకునేందుకు గాను
సీత సినిమాలోని కొన్ని డైలాగ్స్, చూపించిన కొన్ని సీన్స్ పురాణాల్ని, హిందూ మతాన్ని కించపరిచేలా ఉందని బీజేవైఎమ్ సంస్థ ఆరోపిస్తోంది. హిందూమతాన్ని, సంప్రదాయాల్ని ప్రచారం చేసే బీజేవైఎమ్.. సీతపై ప్రత్యేక దృష్టి సారించింది. సినిమాని నిషేధించాలని వారు డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఈ సినిమా విడుదల కాకుండా అడ్డుకొనేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.

సీత మూవీ
తేజ దర్శకత్వంలో ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సీత రూపుదిద్దుకుంది. చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మన్నారా చోప్రా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు, సోను సూద్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఓ రేంజ్ అంచనాల నడుమ మే 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











