DPIFF 2023: RRRకు మరో అవార్డు.. ఉత్తమ నటుడిగా రణ్ బీర్.. బెస్ట్ విలన్ గా 'సీతా రామం' హీరో
భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మంకగా భావించే పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ అవార్డ్. ఈ సంవత్సరం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2023 కార్యక్రమం ఫిబ్రవరి 20న ముంబైలో రాత్రి అట్టహాసంగా జరిగింది. ఈ స్పెషల్ ఈవెంట్ కు సినీ ప్రముఖులు వచ్చి సందడి చేశారు.
వారిలో దర్శకదిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన RRR, రిషబ్ శెట్టి కాంతార, బ్రహ్మాస్త్ర సినిమాలకు అవార్డులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో ఏ అవార్డును ఎవరు తీసుకున్నారు.. సోషల్ మీడియా వేదికగా వారు పంచుకున్న భావాలు ఏంటనే వివరాల్లోకి వెళితే..

RRRకు ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్..
ఇండియన్ సినిమాలోని అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు సంబంధించిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023 సంవత్సరం వేడుక గత రాత్రి ముంబైలో ఘనంగా జరిగింది. వివిధ సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు హజరైన ఈ వేడుకలో పలు సినిమాలు వివిధ క్యాటగిరీల్లో అవార్డులు సొంతం చేసుకున్నాయి.
రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రానికి ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వరించింది. అలాగే కాంతార హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టికి ప్రామిసింగ్ యాక్టర్ పురస్కారం అందుకున్నారు.

నెగెటివ్ రోల్ కి సీతా రామం హీరో..
బ్రహ్మస్త్రం సినిమాకు గాను ఉత్తమ నటుడిగా రణ్ బీర్ కపూర్ అవార్డు అందుకోగా.. ఉత్తమ నటిగా గుంగుబాయి కఠియావాడి చిత్రానికి గాను అలియ భట్ కు పురస్కారం లభించింది. షూటింగ్ బిజీలో ఉన్న కారణంగా రణ్ బీర్ అవార్డును కూడా అతని భార్య అలియా భట్ అందుకుంది.
అలాగే బ్రహ్మాస్త్రం చిత్రానికి ఉత్తమ ప్రతినాయకురాలిగా హాట్ బ్యూటి మౌనీ రాయ్ అవార్డు అందుకుంది. చుప్ సినిమాకు గాను బెస్ట్ నెగెటివ్ రోల్ కింద సీతా రామం హీరో దుల్కర్ సల్మాన్ ను ఈ అవార్డు వరించింది.

వర్సటైల్ యాక్టర్ గా అనుపమ్..
ఉత్తమ చిత్రంగా కశ్మీర్ ఫైల్స్, బెస్ట్ డైరెక్టర్ గా ఆర్. బాల్కి (చుప్ సినిమా), మోస్ట్ వర్సటైల్ యాక్టర్ గా అనుపమ్ ఖేర్, క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ కింద వరుణ్ ధావన్ (బేడియా మూవీ), క్రిటిక్స్ ఉత్తమ నటిగా విద్యా బాలన్ (జల్సా చిత్రం), బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ గా సాచిత్ తాండన్, ఉత్తమ సహాయ నటుడిగా మనీష్ పాల్ (జగ్ జగ్ జీయో)లకు అవార్డులు వరించాయి. వీరందరు అదిరిపోయే ఔట్ ఫిట్స్ తో కార్యక్రమాన్ని కలర్ ఫుల్ గా మార్చారు.
పునీత్ రాజ్ కుమార్ కు అంకితం..
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న నటీనటులు సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. కాంతార సినిమాకు బెస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ అవార్డు అందుకున్న రిషబ్ శెట్టి.. "ఈ అవార్డుతో నాపై బాధ్యత మరింత పెరిగింది. ఈ పురస్కారం దక్కడం గౌరవంగా భావిస్తున్నాను. నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన హోంబలే ఫిల్మ్స్ కు, విజయ్ కిరగందూర్ కు కృతజ్ఞతలు" తెలిపిన ఆయన అతని భార్య ప్రగతి శెట్టి, కాంతార టీమ్ కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ అవార్డును తాము దైవంగా భావించే పవర్ స్టార్, లెజండరీ భగవాన్ పునీత్ రాజ్ కుమారు కు అంకితం ఇస్తున్నట్లు పోస్టులో పేర్కొన్నారు.
డబుల్ హ్యాపీగా అలియా భట్..
బ్రహ్మాస్త్రం సినిమాగు ఉత్తమ విలన్ గా అవార్డు అందుకున్న నాగిని బ్యూటి మౌనీ రాయ్ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్త పరిచింది. "దాదా సాహెబ్ అవార్డ్ కోసం ఇంటికి తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది. కృతజ్ఞతలు" అని రాసుకొచ్చింది. అలాగే అలియా బట్ కూడా తన సంతోషాన్ని వ్యక్త పరిచింది. తనతోపాటు తన ప్రియమైన భర్త రణ్ బీర్ కపూర్ కు ఉత్తమ నటుడిగా అవార్డు రావడంతో డబుల్ హ్యాపీగా ఉంది.
38 ఏళ్లుగా ప్రేమిస్తున్నా..
ఇక మోస్ట్ వర్సటైల్ యాక్టర్ గా అవార్డు అందుకున్న అనుపమ్ ఖేర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కొన్ని వీడియోస్ షేర్ చేస్తూ.. "ది కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2, ఉంచాయి చిత్రాలకు గాను బెస్ట్ వర్సటైల్ యాక్టర్ గా అవార్డు ఇచ్చినందకు దాదా సాహెబ్ ఫాల్కే నిర్వాహకులకు కృతజ్ఞతలు. గత 38 ఏళ్లుగా నన్ను అభిమానిస్తున్న, ప్రేమిస్తున్న అభిమానులకు ఈ అవార్డు అంకితం. నేను ఇలాగే కలలను చేరుకోవడంలో హార్డ్ వర్కుతో కొనసాగిస్తాను. ఉత్తమ చిత్రంగా ది కశ్మీర్ ఫైల్స్ నిలవడం గౌరవంగా ఉంది. జయహో" అని రాసుకొచ్చారు.


Click it and Unblock the Notifications











