Monster వివాదంలో రాజశేఖర్ మూవీ.. టైటిల్ మాదే అంటున్న వంశీ చాగంటి

యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ నటిస్తున్న మాన్‌స్టర్ సినిమా టైటిల్ వివాదంలో చిక్కుకొన్నది. ఈ సినిమా ముహుర్తపు వేడుకతో ప్రారంభమైన తొలి రోజే నటుడు వంశీ చాగంటి పర్యవేక్షణలోని మరో ప్రొడక్షన్ కంపెనీ మాన్‌స్టర్ టైటిల్‌తో సినిమాను ప్రకటించారు. దాంతో ఈ సినిమా టైటిల్‌ విషయం వివాదంగా మారింది. ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

నటుడు వంశీ చాగంటి, పద్మా ఇరువంటి నిర్మాతలుగా వేద్ ఐతరాజు దర్శకత్వంలో మాన్‌స్టర్ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో వంశీ చాగంటితోపాటు ప్రియదర్శి, కల్యాణ్ ఎర్రా, కౌటిళ్య, అశోక్ కుమార్, శుభలేఖ సుధాకర్, కడలి సత్యనారాయణ, కిరిటీ దామరాజు నటించారు. ఈ సినిమాకు సుబ్బారావు తాడివాక డీవోపీగా శశాంక్ భాస్కరుణి మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకొని రిలీజ్‌కు సిద్దమైంది.

Dr Rajasekhars Monster in contraversy, Vamsee Chaganti claims title officialy

ఇలాంటి నేపథ్యంలో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ హీరోగా సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్ నిర్మాతగా పవన్ సాదినేని దర్శకత్వంలో మాన్‌స్టర్ చిత్ర షూటింగ్ ఆగస్టు 23వ తేదీన ప్రారంభమైంది. యాంగ్రీ స్టార్ రాజశేఖర్ మరోసారి పవర్‌ఫుల్ పాత్రలో పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తారని చిత్ర యూనిట్ తెలిపింది. ఎం జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.

వివేక్ కాలెపు సినిమాటోగ్రఫిని అందిస్తున్నారు. విప్లవ్ నైషాడం ఎడిటర్‌గా, రాకెందు మౌళి డైలాగ్స్ రాస్తున్నారు. హుస్సేన్ వసంత్ జుర్రు అదనపు స్క్రీన్ ప్లేను అందిస్తున్నారు. శ్రీనివాస్ నారిణి ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు. మిగితా నటీనటుల వివరాలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.

Dr Rajasekhars Monster in contraversy, Vamsee Chaganti claims title officialy

అయితే మాన్‌స్టర్ టైటిల్‌ను చాలా రోజుల క్రితమే రిజిస్టర్ చేసుకొన్నాం. ఇప్పుడు రాజశేఖర్ హీరోగా మాన్‌స్టర్ టైటిల్‌తో ప్రారంభ వేడుక జరిగిందనే విషయం మా దృష్టికి వచ్చింది. మాన్‌స్టర్ టైటిల్ మా వద్ద ఉంది. ఆ విషయం వారి దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం అని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X