For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చంద్రబాబును పొగిడిన రాజశేఖర్.... జగన్‌కు మరో సారి హ్యాండ్.. రూలర్ ఈవెంట్‌లో ఆసక్తికర కామెంట్లు

|

తెలుగు ఇండస్ట్రీ అంటే ఒకప్పుడు కేవలం టీడీపీ మద్దతుదారులే. అయితే జరుగుతున్న పరిణామాల దృష్టా కొన్ని కొత్త సమీకరణాలు రూపు దిద్దుకుంటున్నాయి. ఇవన్నీ ఒకెత్తు అయితే సినీ, రాజకీయాల్లో డా. రాజశేఖర్ దంపతులది విచిత్ర వైఖరి. ఎప్పుడూ ఓ చోట ఉండని మనస్తత్వం వారిది. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో వారికే తెలీదు.

ఎన్నికలకు ముందు జగన్ పార్టీలో..

ఎన్నికలకు ముందు జగన్ పార్టీలో..

2019 ఎన్నికలకు ముందు రాజశేఖర్ సతీసమేతంగా వైఎస్సార్‌సీపీలో జాయిన్ అయ్యారు. అంతకు ముందు జగన్‌పై తీవ్ర విమర్శలు చేసి.. టీడీపీలోకి చేరిపోయారు. ఆ సమయంలో జగన్‌పై చేసిన ఆరోపణలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే ఎన్నికల్లో వచ్చే ఫలితాన్ని ముందే పసిగట్టినట్టు.. సడెన్‌గా జగన్ పార్టీలోకి జంప్ అయ్యారు. మళ్లీ ఆ సమయంలో ఆయనపై ప్రశంసలజల్లు కురిపించారు. ఏ ఎండకు ఆ గొడుగు అన్న చందంగా తయారయ్యారని సోషల్ మీడియలో తెగ ట్రోలింగ్ జరిగేది.

స్పందించని టాలీవుడ్..

స్పందించని టాలీవుడ్..

తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది ప్రస్తుతం జగన్ పార్టీలోనే ఉన్నారు. ఎన్నికల ముందు నుంచి ఆయనకు సపోర్ట్ పెరిగింది. అయితే పెద్ద స్టార్స్ మాత్రం డైరెక్ట్‌గా జగన్‌కు మద్దతివ్వక పోయినా లోలోపల అంతా జరిగిందని టాక్. ఆ మధ్య చిరంజీవి వెళ్లి జగన్ కలవడం సినీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చను లేవనెత్తింది. భారీ మెజార్టీతో గెలిచిన జగన్‌కు.. టాలీవుడ్ నుంచి శుభాకాంక్షలు గానీ ప్రశంసలు గానీ రాలేదు.

మళ్లీ మనసు మార్చుకునే యోచనలో..

మళ్లీ మనసు మార్చుకునే యోచనలో..

పార్టీలు మారి మారి చివరికి జగన్ దగ్గరికి వచ్చి ఆగిన రాజశేఖర్.. ఉన్నట్లుండి జగన్‌కు హ్యాండిచ్చేలా కనిపిస్తున్నాడు. సడెన్‌గా అందరికీ ఈ అనుమానం ఎందుకు వచ్చిందంటే.. నిన్న జరిగిన రూలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాజశేఖర్ స్పీచే కారణం. ఆ మాటలను విశ్లేషిస్తే.. పార్టీ మారే యోచనలో ఉన్నాడేమోనన్న అనుమానం కలగక మానదు.

చంద్రబాబును పొగిడిన రాజశేఖర్..

చంద్రబాబును పొగిడిన రాజశేఖర్..

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లొ భాగంగా.. రాజశేఖర్ స్పీచ్ ఇరగదీశాడు. అదే ఇప్పుడు ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. బాలయ్య రూలర్.. ఆయన తండ్రి కూడా ఓ రూలర్ అని చెప్పాడు రాజశేఖర్. అక్కడితో ఆగకుండా ఆయన వియ్యంకుడు కూడా ఓ రూలర్ అంటూ చంద్రబాబును కూడా పొగిడేసాడు.

భజన స్పీచులు మామూలే..

భజన స్పీచులు మామూలే..

ఇలాంటి సినీ ఫంక్షన్లలో భజన స్పీచులో మామూలే అని కొందరు అంటుంటే.. తోటి హీరో కాబట్టి బాలయ్య సినిమా వేడుకకు వెళ్లడంలో తప్పు లేదని మరికొందరు అంటున్నారు. బాలయ్య, ఎన్టీరామారావు వరకు ఓకే కానీ అందరికీ భజన చేయాల్సిన అవసరం ఏంటని రాజశేఖర్ దంపతులను ఓ ఆట ఆడేసుకుంటున్నారు.

English summary
Dr Rajasekhar Given Shock To YS Jagan By Praising Chandrababu Naidu. Boyapati Sreenu Hesitated By Fans AT Ruler Pre Release Event. Nandamuri Balakrishna Ruler Pre Release Event. This Movie Is Directed By KS Ravikumar And Produced By C Kalyan. Bhumika, Prakash Raj, Sonal Chauhan Are Playing Important Character.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more