ప్రియాంక రెడ్డి హత్యపై రాజశేఖర్ కామెంట్స్.. నీతి, నిజాయితీ ఎక్కడ అంటూ ఆవేదన
హైదరాబాద్‌లో జరిగిన ప్రియాంక రెడ్డి హత్య దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ హత్య తాలూకు నిజాలు తెలిసి జనం నివ్వెరపోతున్నారు. దేశంలో సాధారణ మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రియాంక రెడ్డి హత్యపై పలువురు టాలీవుడ్ సెలెబ్రిటీలు ఘాటుగా స్పందిస్తున్నారు. తాజాగా ఈ అంశంపై డాక్టర్ రాజశేఖర్ కామెంట్ చేశారు.

ఈ దేశంలో మహిళకు సెక్యూరిటీ ఎక్కడుంది?
శంషాబాద్ ఔటర్ రింగురోడ్డుపై తొండుపల్లి టోల్‌ప్లాజా బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన గురించి తెలిసి అంతా నిర్ఘాంతపోయారు. నిత్యం వాహనాలతో కిటకిటలాడే టోల్‌ప్లాజా వద్దనే ఇలా లైంగికదాడి జరిగిందంటే.. ఇక ఈ దేశంలో మహిళకు సెక్యూరిటీ ఎక్కడుంది? అంటూ ఈ ఘటనపై పెద్దఎత్తున రియాక్ట్ అవుతున్నారు మేధావులు.

దారుణమైన ఘటనలు.. రాజశేఖర్ రియాక్షన్
ప్రియాంక రెడ్డి హత్య ఘటనపై సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యాడు సినీ హీరో డాక్టర్ రాజశేఖర్. ''ప్రియాంక రెడ్డి, మానస ఘటనల గురించి తెలిసి గుండె పగిలిపోయింది. ఇవి చాలా దారుణమైన ఘటనలు. దీనికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి. ఇంకా ఎన్ని ప్రాణాలు ఇలా గాలిలో కలిసిపోతాయి?'' అంటూ తీవ్ర ఆవేదన చెందారు రాజశేఖర్.
నీతి, నైతిక విలువలు ఎక్కడ? అంటూ ఘాటు ప్రశ్న
ఇక ఇదే సోషల్ మీడియా వేదికగా మీడియా మరియు నెటిజన్లపై కూడా విరుచుకుపడ్డారు రాజశేఖర్. బాధితురాలి ఫోటోలు ఇష్టానుసారంగా షేర్ చేసుతున్నారు. మీ యొక్క నీతి, నైతిక విలువలు ఎక్కడ పోయాయి? అంటూ ఘాటు ప్రశ్న వేశారు రాజశేఖర్.
సాయి రాజేష్ ఫైర్..
ఇవే సంఘటనలపై కొబ్బరిమట్ట డైరెక్టర్ సాయి రాజేష్ ఫైర్ అవుతూ ట్వీట్ పెట్టాడు. ''పోలీసులు కి ఫోన్ చేస్తే "ఎవరితోనో లేచిపోయి ఉంటుంది, తెలిస్తే చెప్తామ్ లే" అని చెప్పారట. ప్రియాంక తల్లి మీడియాతో చెప్పింది. నిందితులను అస్సలు వదలొద్దు. కఠిన శిక్ష వేసి తీరాలి'' అని పేర్కొన్నాడు.
Recommended Video
చాలా బాధేసిందంటూ అల్లు శిరీష్
ప్రియాంక రెడ్డి హత్య ఘటన గురించి తెలిసి తనకు చాలా బాధేసిందంటూ అల్లు శిరీష్ ట్వీట్ చేశాడు. ''ఇలాంటి ఘటనపై సామూహికంగా రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. అప్పుడే మహిళలకు మరింత భద్రత కలుగుతుంది'' అని పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











