Monster గా రాజశేఖర్.. పవర్‌పుల్ పాత్రలో యాంగ్రీ మ్యాన్.. దర్శకుడు ఎవరంటే?
సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్ నిర్మాతగా పవన్ సాదినేని దర్శకత్వంలో మాన్‌స్టర్ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. యాంగ్రీ స్టార్ రాజశేఖర్ మరోసారి పవర్‌ఫుల్ పాత్రలో పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో దయాదాక్షిణ్యాలు లేని హీరో పాత్రలో మరోసారి రాజశేఖర్ తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి.
మానస్టర్ బౌండెడ్ స్క్రిప్టును దర్శకుడు పవన్ సాదినేని సిద్దం ఇప్పటికే సిద్ధం చేశారు. ఈ చిత్రంలో గ్యాంగ్‌స్టర్, పోలీసులకు మధ్య చిక్కిన మాన్‌స్టర్.. తన లక్ష్యాన్ని ఎలా చేరుకొన్నాడనేది ఈ సినిమా కథ. రాజశేఖర్ క్యారెక్టర్ మాన్‌స్టర్ మాదిరిగా ఉంటుంది అని చిత్ర యూనిట్ తెలిపింది.

మాన్‌స్టర్ స్క్రిప్టును పవన్ సాదినేనికి హీరో రాజశేఖర్, నిర్మాతలు బెక్కం వేణుగోపాల్, శివకుమార్ అందజేశారు. నిర్మాత దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్ కెమెరాను స్విచ్ఛాన్ చేశారు. ప్రముఖ దర్శకులు ప్రవీణ్ సత్తారు ప్రారంభ సన్నివేశాలకు క్లాప్ కొట్టారు. దర్శకులు ప్రశాంత్ వర్మ తొలి సన్నివేశానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నది.
మానస్టర్ సినిమాకు ప్రతిభావంతులైన సాంకేతిక వర్గం పనిచేస్తున్నది. ఎం జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. వివేక్ కాలెపు సినిమాటోగ్రఫిని అందిస్తున్నారు. విప్లవ్ నైషాడం ఎడిటర్‌గా, రాకెందు మౌళి డైలాగ్స్ రాస్తున్నారు. హుస్సేన్ వసంత్ జుర్రు అదనపు స్క్రీన్ ప్లేను అందిస్తున్నారు. శ్రీనివాస్ నారిణి ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు. మిగితా నటీనటుల వివరాలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.

డైరెక్టర్: పవన్ సాదినేని
నిర్మాత: మల్కాపురం శివకుమార్
బ్యానర్: సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా
మ్యూజిక్: జీబ్రాన్ ఎం
డీవోపీ: వివేక్ కాలెపు
ఎడిటర్: విప్లవ్ నైషాడం
డైలాగ్స్: రాకేందు మౌళి
అడిషినల్ స్క్రీన్ ప్లే: హుస్సేన్ షా కిరణ్, వసంత్ జుర్రు
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనివాస్ నారిని
క్యాస్టూమ్ డిజైనర్: లంకా సంతోషి
పీఆర్వో: వంశీశేఖర్


Click it and Unblock the Notifications











