twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ek Mini Katha మూవీకి డాక్టర్ సమరం కాలమ్ స్పూర్తి.. సీక్రెట్ బయటపెట్టిన రచయిత!

    |

    ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. మరీ ముఖ్యంగా చిన్న సినిమానా పెద్ద సినిమానా అనే విషయం పక్కన పెడితే వైవిధ్యంగా ఉన్న సినిమాలకు ఖచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ దక్కుతోంది. అలా ఒక వైవిధ్యమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతోంది ఏక్ మినీ కధ. దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది.. ఈ సినిమాకు మూలం ఎక్కడ అనే విషయాన్ని తాజాగా సినిమా రచయిత మేర్లపాక గాంధీ వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే

    ట్రైలర్ తోనే అంచనాలు

    ట్రైలర్ తోనే అంచనాలు

    సంతోష్‌ శోభన్‌, కావ్య థాపర్‌ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఏక్‌ మినీ కథ'. మేర్లపాక గాంధీ కథ అందించిన ఈ చిత్రానికి కార్తీక్‌ రాపోలు దర్శకత్వం వహించాడు. యూవీ కాన్సెప్ట్స్‌ బ్యానర్‌పై ఈ సినిమాని తెరకెక్కించారు. శుక్రవారం నాడు ఈ సినిమా ట్రైలర్‌ రిలీజైంది. ఈ ట్రైలర్ సినిమా మీద ఆసక్తి పెంచింది అనే చెప్పాలి. ఈ సినిమాలో హీరో చిన్నప్పటి నుంచి మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటాడు.

    కాన్ఫిడెన్స్

    కాన్ఫిడెన్స్

    ఈ సినిమాని థియేట‌ర్‌లో రిలీజ్ చేయాల‌ని యువి సంస్థ ఇంత కాలం ఆగింది, అంటేనే ఈ సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ అర్థం చేసుకోవ‌చ్చు. కానీ క‌రోనా సెకెండ్ వేవ్‌ రావడంతో ఇక తప్పక దానిని అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా కధ ఎలా పుట్టింది అనే అంశాన్ని రచయిత మేర్లపాక గాంధీ పంచుకున్నారు.

    స్వాతి పత్రికతో

    స్వాతి పత్రికతో

    ఇది 'పెనిస్' చిన్నది అనే ఆలోచనతో మధనపడే కుర్రాడి కథ అని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే ఈ స్టోరీ ఎలా పుట్టింది అనే అంశం గురించి ఆయన మాట్లాడుతూ ఈ ఐడియా తనకు స్వాతి పత్రికలో సెక్సాలజీ కాలమ్ చదువుతున్నప్పుడు వచ్చిందని అన్నారు. తాను కుర్రాడిగా ఉన్నప్పుడు స్వాతి మ్యాగజైన్ చదివేవాడినన్న ఆయన అందులో డాక్టర్ సమరం గారు పాఠకుల పర్శనల్ ప్రశ్నలకు సమాధానం ఇస్తూండేవారని చెప్పుకొచ్చారు.

    సమరం గారి కాలమ్

    సమరం గారి కాలమ్

    గత ఏడాది కరోనా లాక్ డౌన్ సమయంలో అనుకోకుండా ఆ పుస్తకంలో కాలమ్ చూశానని అన్నారు. పదేళ్ల క్రితం నాటి ఆ పుస్తకంలో ఓ వ్యక్తి ..తను అంగం చిన్నదిగా ఉందనే సమస్యతో బాధపడుతూ పరిష్కారం చెప్పమని అడిగాడని అన్నారు. దీంతో ఇంత టెక్నాలజీ పెరిగినా ఇలాంటి సమస్యలతో సతమతమయ్యేవారు ఉంటారనిపించి ఆ కోణంలో ఈ కథ రాశాను అని గాంధీ చెప్పుకొచ్చారు.

    Recommended Video

    OTT లో Ek Mini Katha, Prabhas Facebook Post || Filmibeat Telugu
    రిలీజ్ కి సిద్దం

    రిలీజ్ కి సిద్దం

    ఇక తెలుగులో శాస్త్రీయంగా, వైద్య ప‌రంగా సెక్స్ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించిన వ్య‌క్తి డాక్ట‌ర్ స‌మ‌రం. 44 ఏళ్లుగా ఆయ‌న స‌మాజానికి సెక్స్ డాక్టర్ గా సేవలు అందిస్తున్నారు. ఇక మేర్లపాక గాంధీ కథ అందించిన ఈ సినిమాకి కార్తీక్ రాపోలు దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాకి ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్నారు. సంతోష్ శోభన్, కావ్య తప్పర్, శ్రద్ధాదాస్, బ్రహ్మాజీ, సప్తగిరి, సుదర్శన్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమా రేపు అంటే 27 మే 2021 నాడు అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది.

    English summary
    Ek Mini Katha starring Santosh Sobhan and Kavya Thapar is all set to stream on OTT platform Amazon Prime Video. Ahead of the release, writer Merlapaka Gandhi has revealed an interesting fact about this film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X