Dragon Glimpse Review: ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ గ్లింప్స్ రివ్యూ

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం డ్రాగన్. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్, మలయాళ నటుడు బిజూ మీనన్‌తోపాటు రుక్మిణి వసంత్, కుష్బూ సుందర్, రాజీవ్ కనకాల, అశుతోష్ రాణా, ప్రభాస్ శ్రీను, శత్రు, బెనెడిక్ట్ పాల్ గ్యారెట్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కల్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే..మ్యూజిక్: రవి బస్రూర్, సినిమాటోగ్రఫి: భువన్ గౌడ, ఎడిటర్: ప్రణవ్ శ్రీ ప్రసాద్, స్టంట్స్: పీటర్ హెయిన్స్ తదితరులు వ్యవహరిస్తున్నారు. నందమూరి తారక రామారావు (జూనియర్ ఎన్టీఆర్) బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ ఎలా ఉందనే విషయంలోకి వెళితే..

Dragon Glimpse Review

దర్శకుడు ప్రశాంత్ నీల్ తన పట్టు ఉన్న మాఫియా, గ్యాంగ్ వార్ కథనే ఎంచుకొని దానికి బ్రిటీష్, ఇండిపెండెన్స్ పోరాటాన్ని జోడించారు. రుక్మిణి పాత్ర ద్వారా పాత్రలను పరిచయం చేసిన విధానం బాగుంది. అలాగే ఎన్టీఆర్ స్క్రీన్ విధ్వంసాన్ని కళ్లారా అభిమానులకు గ్ల్రింప్స్‌‌లో చూపించి యంగ్ టైగర్ నట విశ్వరూపాన్ని శాంపిల్‌గా చూపించారనే ఫీలింగ్ కల్పించాడు.

గ్లింప్స్‌లో ఎన్టీఆర్ మ్యాజిక్ మిస్ అయినప్పటికీ.. పవర్‌ఫుల్ లుక్ మాత్రం ఫ్యాన్స్‌కు పండుగ వాతావరణమే క్రియేట్ చేసేలా ఉంది. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఎంట్రీ, కథలో బలంగా కనిపించింది. అనిల్ కపూర్ మరోసారి స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. రుక్మిణి వసంత్ పాత్ర గ్లామర్‌గా చూడటానికి బాగుంది. కానీ పాత్రను ప్రజెంటర్‌గానే చూపించడం వల్ల డెప్త్ కనిపించలేదు.

ఇక ఎప్పటిలానే ప్రశాంత్ నీల్ సినిమాలో క్రేజీగా ఉండే మ్యూజిక్, సినిమాటోగ్రఫి హైలెట్‌గా నిలిచింది. రవి బస్రూర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. భువన్ గౌడ విజువల్స్ గ్రాండ్‌గా ఉన్నాయి. ఈ గ్లింప్స్ చూస్తే లార్జర్ ద్యాన్ లైఫ్ అనే ఇమేజ్‌ను క్రియేట్ చేసింది.

Read more about: dragon jr ntr prashanth neel
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X