ప్రగతి డ్యాన్స్ స్టెప్పులు చూస్తే మతిపోవాల్సిదే...ఆ ట్రెండింగ్ సాంగ్‌కు మోత మోగించింది

టాలీవుడ్‌లో అమ్మగా, అత్తగా, అక్కగా అన్నీ సాంప్రదాయ పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రగతి సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్. ఎన్నో సినిమాల్లో అత్త, పిన్ని, తల్లి పాత్రలు పోషించి ఆ పాత్రకు న్యాయం చేసిన ప్రగతి కేవలం నటనలోనే కాదు సరైన అవకాశం వస్తే.. డ్యాన్స్‌లోనూ ఇరగదీస్తాను అనేలా అప్పుడప్పుడు వీడియోలు విడుదల చేస్తోంది. ఇప్పుడు కూడా అదే బాటలో ఒక వీడియో రిలీజ్ రచ్చ రేపింది. వివరాల్లోకి వెళితే

హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి

హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి

తెలుగు సినిమా ప్రేక్షకులకు నటి ప్రగతి సుపరిచితమే. నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఆమె. ఎన్నో సినిమాల్లో అత్త, పిన్ని, తల్లి పాత్రలు పోషిస్తూ ఉన్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కలిపి 120కి పైగా సినిమాల్లో నటించిన ఆమె ప్రకాశం జిల్లా ఒంగోలులో పుట్టారు. అయితే ఆ రోజుల్లోనే సినిమాల్లో హీరోయిన్ గా మారాలని చెన్నై వెళ్లారు. మొదట హీరోయిన్‌గా తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రగతి.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.

కుర్రాళ్ళలో ఫాలోయింగ్

కుర్రాళ్ళలో ఫాలోయింగ్

నటి ప్రగతి మరోసారి సోషల్ మీడియాలో తన వీడియోతో రచ్చ చేస్తోంది. ఇప్పటికే చాలా సార్లు తన క్యూట్ అండ్ హాట్ డాన్స్ వీడియోలు పోస్ట్ చేసి కుర్రాళ్ళలో ఫాలోయింగ్ పెంచుకున్న ఆమె మళ్ళీ అదే పని చేసి వావ్! అనిపించింది. సినిమాల్లో కేవలం సంప్రదాయ పాత్రల్లో మాత్రమే నటిస్తూ ఎంతో పద్ధతిగా చీరకట్టులో కనిపించే ప్రగతి గత ఏడాది అయితే లాక్‌డౌన్ సమయంలో ఫిట్‌ నెస్‌ మీద సూపర్ ఫోకస్ పెట్టేసింది.

ఎక్సర్సైజులు, జుంబా డాన్స్ వీడియోలు

ఎక్సర్సైజులు, జుంబా డాన్స్ వీడియోలు

అందుకే ఆ రోజుల్లో ఎక్సర్సైజులు, జుంబా డాన్స్ వీడియోలు, మామూలు, డాన్స్ వీడియోలు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. లేటు వయసులో ఘాటు అందాలతో స్టెప్పులేస్తుండటంతో ప్రగతికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగిపోతోంది. అయితే, తాజాగా మరో వీడియోను ప్రగతి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్చేశారు. ఈ వీడియోలో మరో మహిళతో కలిసి ప్రగతి డ్యాన్స్ చేశారు, మొత్తంగా చూస్తే ఈ వీడియోలో ఆమె డ్యాన్స్ సూపర్ అంతే.

డ్రీమమ్ వేకపమ్ అంటూ

డ్రీమమ్ వేకపమ్ అంటూ

గత వీడియోల కంటే భిన్నంగా బ్రేక్ డ్యాన్స్ లా చేశారు ఆమె. ఫాస్ట్ మూమెంట్స్‌, డ్యాన్స్ లో ఆమె గ్రేస్ చూసి 'వాట్ ఏన్ ఎనర్జీ' అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 44 ఏళ్ల వయసులో ఫిజికల్ ఫిట్ నెస్‌పై ఫోకస్ పెడుతున్న ప్రగతిని చూసి ఆడవాళ్ళు సైతం కుళ్లుకునే పరిస్థితి. ఇక ఇక తాజాగా ఆమె బాలీవుడ్‌ సినిమా 'ఐయా'లోని సాంగ్‌ 'డ్రీమమ్ వేకపమ్' అనే పాటకు ఆమె డ్యాన్స్ ఇరగదీసేసింది. అంతే కాదు అందరికీ ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే విషెస్ అంటూ కామెంట్ చేసింది.

2012 సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్

2012 సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్

ఐయా అనే సినిమాలోని ఈ సాంగ్ ఇప్పుడు లేటెస్ట్ గా ట్రెండ్ అవుతోంది. రాణి ముఖర్జీ - పృథ్వీరాజ్ సుకుమారన్ హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా 2012లో రిలీజ్ అయింది. రొమాంటిక్ కామెడీ-డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకి సచిన్ కుండల్కర్ దర్శకత్వం వహించారు. అనురాగ్ కశ్యప్ మరియు వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా 12 అక్టోబర్ 2012 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X