10 కోట్లు డిమాండ్‌తో బ్లాక్‌మెయిల్.. టీవీ5 మూర్తిపై యువ నటుడు కేసు నమోదు
సినీ నటుడు ధర్మ సత్యసాయి మహేష్, ఆయన భార్య గౌతమి చౌదరీ దాంపత్య జీవితంలో విభేదాల వివాదం కొత్త మలుపు తిరిగింది. తమ కాపురంలో జోక్యం చేసుకొంటున్నారనే ఆరోపణల మధ్య ధర్మ మహేష్ తాజాగా ప్రముఖ జర్నలిస్టు టీవీ5 మూర్తిపై ఆయన కేసు నమోదు చేసినట్టు వార్తలు మీడియాలో వెలుగు చూశాయి. ఈ వార్తను ఇరు వర్గాలు ధృవీకరించాల్సి ఉంది. అయితే ధర్మ మహేష్, గౌతమీ చౌదరీ మధ్య వివాదం, ఈ కేసు వివరాల్లోకి వెళితే..
గత కొద్దికాలంగా ధర్మ మహేష్, గౌతమీ చౌదరీ మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకొన్నాయి. తనతో కాపురం చేయకుండా ఇతరులతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారు. బిగ్‌బాస్ కంటెంస్టెంట్లు, అలాగే యాంకర్లతో ఆయన అర్ధరాత్రులు పార్టీలు చేసుకొంటున్నారు. తన ఇంటిలోనే తన బెడ్ రూమ్‌లోనే వారితో గడుపుతున్నాడనే విధంగా గౌతమి చౌదరీ తన భర్తపై మీడియా ఇంటర్వ్యూలో ఆరోపణలు చేశారు.

గౌతమీ చౌదరీ ఆరోపణలు ఇలా ఉండగా, ధర్మ మహేష్ తన భార్యపై, టీవీ5 మూర్తీ సంచలన ఆరోపణలు చేశాడు. తన భార్యతో క్లోజ్‌గా ఉంటూ.. తన ఇంటిలో ఎక్కువగా కనిపిస్తున్నాడు. తన డైనింగ్ టేబుల్‌పై, తన ప్లేటులో భోజనం చేశాడు అంటూ వీడియోలు, ఫోటోలను మీడియాలోను, సోషల్ మీడియాలోను షేర్ చేయడంతో ఈ వ్యవహారం మరింత వివాదంగా మారడమే కాకుండా కొత్త మలుపు తిరిగింది.
అయితే తాజాగా టీవీ5 మూర్తిపై ఫిర్యాదు చేయడంతో కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. తన ఫోన్ ట్యాప్ చేసి తన వ్యక్తిగత వివరాలను, ఫోటోలను, వీడియోలను మీడియాలో పెడుతానని బెదిరిస్తున్నాడు. సెటిల్మెంట్ చేసుకోవడానికి 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడు అని కోర్టును ఆశ్రయించాడు. అలాగే తన ఫిర్యాదును స్వీకరించడం లేదు. కేసు నమోదు చేయడం లేదంటూ పోలీసుల తీరును కోర్టుకు విన్నవించుకొన్నాడు.
దాంతో ధర్మ మహేష్ ఇచ్చే ఆధారాలు, సాక్ష్యాల ఆధారంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో గౌతమి చౌదరీ, టీవీ5 మూర్తిపై కూకట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తున్నది. గౌతమిని A1, మూర్తిని A2 గా చేరుస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిసింది. ఈ కేసు వ్యవహారంలో గౌతమి, టీవీ5 మూర్తి స్పందన ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొన్నది.
ధర్మ మహేష్ వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయానికి వస్తే.. ధర్మ మహేష్ ఇటీవల డ్రింకర్ సాయి అనే సినిమా ద్వారా హీరోగా తెలుగు సినిమా రంగానికి పరిచయం అయ్యాడు. ఆయన ఏపీ మాజీ మంత్రి కాకాని వెంకటేశ్వరరావు కుమారుడు. గౌతమి చౌదరీ అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్లూయెన్సర్‌తో ప్రేమ వివాహం జరిగింది. వారికి ఓ కుమారుడు సంతానంగా ఉన్నాడు. గతంలో పలు ఆరోపణలతో ఈ మధ్య వారి కాపురంలో కలతలు చెలరేగడం వివాదంగా మారింది.


Click it and Unblock the Notifications











