ప్రియమణి బికినీ కధ… అందుకే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పా… వివరాలు బయట పెట్టిన ద్రోణ నిర్మాత
ప్రియమణి తెలుగులో జగపతి బాబు హీరోగా వచ్చిన 'పెళ్లైన కొత్తలో' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'యమదొంగ' సినిమా ద్వారా ఆమె స్టార్ హీరో హోదా సంపాదించింది. ఈ సినిమా దెబ్బకు ఆ తరువాత మరిన్ని సినిమాలు చేస్తూ మరిన్ని అవకాశాలు అందుకుంది. కొత్త హీరోయిన్ల ఎంట్రీ కారణంగా ఆమెకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు సినిమాలు తగ్గించిన ఆమె టీవీల్లో వివిధ కార్యక్రమాలకు జడ్జ్‌గా వ్యహరిస్తూ అదరగొడుతోంది. అయితే ఆమెకు సంబంధించిన బికినీ కధ వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే

కేరళ కుట్టి ప్రియమణి
కేరళకి చెందిన ప్రియమణి తెలుగులో వరుస సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అయితే కాస్త అవకాశాలు తగ్గడంతో ఆమె తన అందాన్ని ఆరబోయడానికి, గ్లామర్ గా కనిపించడానికి కూడా వెనుకాడలేదు. అయితే ఆ రోజుల్లో ఆమె ద్రోణ అనే సినిమాలో బికినీలో కనిపించి అందరి మతులు పోగొట్టింది.. 2009లో విడుదలైన ఈ సినిమాలో బికినీలో నటించిన ఆమె అప్పట్లో పెను సంచలనమే సృష్టించారు.. ఇప్పుడు బికినీ ధరించడం అనేది కామన్ అయిపోయింది కానీ ఆ రోజుల్లో బికినీ ధరించడం అనేది చాలా పెద్ద విషయం.

ఆ రోజుల్లో సంచలనం
ద్రోణ సినిమాలో నితిన్ ప్రియమణి హీరో హీరోయిన్స్ గా నటించారు.. 2009లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకి నిర్మాతగా దమ్మాలపాటి శ్రీనివాసరావు వ్యవహరించారు. అప్పట్లో బికినీ వేయడానికి గాను ప్రియమణి ఆయన దగ్గర భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసి తీసుకుందని ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది.. ఈ నేపథ్యంలోనే సినిమా రిలీజ్ కి కొన్ని గంటల ముందు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి అలాంటిదేమీ లేదని ప్రియమణి చాలా మంచిది అని ఎలాంటి డిమాండ్ చేయకుండా దర్శకుడి కోరిక మేరకు ఇలా కనిపించిందని చెప్పుకొచ్చారు.

ఆరోజు ఏం జరిగిందంటే
తాజాగా దీనికి సంబంధించి దమ్మాలపాటి శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా ఇలా బికినీ వేస్తారా అని ఎవరైనా హీరోయిన్స్ ని అడిగినప్పుడు ముందు కథ చెప్పినప్పుడు చెప్పకుండా ఇప్పుడు ఎందుకు చెప్పారు ? మేము చేయమని చెబుతారని కానీ ప్రియమణి ఒక ఐదు నిమిషాల పాటు ఆలోచించుకుని బికినీ వేస్తానని ఒప్పుకుందని చెప్పుకొచ్చారు. సినిమా మీద క్రేజ్ తీసుకురావడానికి దర్శకుడు ఇలా బికినీ ధరింపచేశారు అని దర్శకుడి కోరిక మేరకు పాట మొత్తం బికినీ వేసుకుని ప్రియమణి కనిపించిందని చెప్పుకొచ్చారు.

వెబ్ సిరీస్ ల మీద ఫోకస్
హీరోయిన్ అవకాశాలు తగ్గడంతో ఆమె వచ్చిన అన్ని పాత్రలు చేస్తూ సినిమాలతో పాటు కొన్ని వెబ్ సిరీస్‌లు కూడా చేస్తోంది. ఇప్పటికే 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌తో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా 'హిజ్ స్టోరీ' అనే వెబ్‌సిరీస్‌లో కూడా ఆమె నటించింది. సత్యదీప్ మిశ్రా ఈ సిరీస్‌లో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ సిరీస్‌లో ప్రియామణి చెఫ్ పాత్రలో నటించింది. ఈ నెల 25న విడుదలైన ఈ సిరీస్‌కి ప్రేక్షకుల ఆదరణ లభించింది.
Recommended Video

సెకండ్ ఇన్నింగ్స్ లో
ఇక మరో పక్క ఆమె తెలుగు టెలివిజన్ లో ప్రసారం అయ్యే కొన్ని డ్యాన్స్ షోలకి జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మరో పక్క రానా హీరోగా నటిస్తున్న విరాటపర్వం, నారప్ప సినిమాల్లో నటించగా ప్రస్తుతం ఈ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన తలైవి సినిమాలో కూడా ఆమె కీలక పాత్రలో నటిస్తుంది. ఇక బాలీవుడ్ లో సైతం ఆమె మైదాన్ సినిమాలో నటిస్తుంది.


Click it and Unblock the Notifications











