గర్వంగా ఉందంటూ.. ఆ డైరెక్టర్‌ను బావా అనేసిన ద్రోణవల్లి హారిక.. అసలు మ్యాటరేంటంటే..?
విక్టరీ వెంకటేష్-నాగచైతన్య హీరోలుగా నటించిన వెంకీమామ ఇటీవల విడుదలై సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా.. వసూళ్లు మాత్రం జోరుగానే ఉన్నాయి. సంక్రాంతి వరకు వెంకీమామదే సందడన్నట్లు సినిమా విడుదలకు ముందు యూనిట్ చెప్పినట్టుగానే జరుగుతోంది. సినిమా విడుదలై నాలుగు వారాలు కావాల్సి వస్తున్న బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు.

వర్కౌట్ అయిన కామెడీ..
వెంకీమామ మాస్ ఆడియన్స్‌కు సినిమా బాగా రీచ్ అయినట్టు కనిపిస్తుంది. సినిమాలో కామెడీ వర్కౌట్ అవ్వడంతో మామ-అల్లుళ్లు సేఫ్‌గా బయటపడ్డట్టు టాక్. ఈ సక్సెస్‌తో లెజెండరీ నిర్మాత, మూవీ మొఘల్ రామానాయుడు ఆత్మకు ఘన నివాళి దక్కినట్టైంది. వారి కుటుంబంలో ఓ భారీ మల్టీ స్టారర్ నిర్మించాలనుకున్న కలను సురేష్ బాబు తీర్చడం.. అది కూడా ఇంత పెద్ద సక్సెస్ కావడంతో ఇరు కుటుంబాల్లో ఆనందం రెట్టింపైనట్టు తెలుస్తోంది.

మహేష్ బాబు, మెగాస్టార్ సైతం..
మెగా స్టార్ చిరంజీవి, మహేష్ బాబు లాంటి స్టార్లు సినిమాను చూసి ప్రశంసించారు. ఈ చిత్రంలో కామెడీ తనకెంతో నచ్చిందని చిరంజీవి ప్రత్యేకంగా ప్రశంసించడం, సినిమా ఆద్యంతం ఎంటర్టైనింగ్‌గా ఉందని మహష్ బాబు ట్వీట్ చేయడం అందరికీ తెలిసిందే. దీంతో యూనిట్ ఘనంగా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ప్రస్తుతం మామ-అల్లుడు రెట్టించిన ఉత్సాహం లో ఉన్నారు.

దర్శకుడిగా బాబీకి పేరు..
ఈ సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించింది డైరెక్టర్ బాబీ అలియాస్ కె.ఎస్ రవీంద్ర. అద్భుతమైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే కాకుండా కంటతడి పెట్టే ఎమోషనల్ సీన్స్‌లోనూ తన ప్రతిభను కనబరిచాడు. మొత్తంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా వెంకీమామను ఆడియెన్స్‌కు నచ్చేలా చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. దీంతో దర్శకుడిగా బాబీకి మంచి పేరు వచ్చింది. ఈ సక్సెస్ చూసి బాబీ మరదలు.. తన బావను తెగ పొగిడేసింది.
గర్వంగా ఉంది..
ఆ దర్శకుడి మరదలు మరెవరో కాదు.. అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచిన చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక. ఆమె అక్క అనూషనే బాబీ వివాహం చేసుకున్నాడు. అలా హారిక బాబీకి మరదలైంది. ఇప్పుడు తన బావ ప్రతిభను చూసి మరదలు ఉబ్బితబ్బిబైపోతోంది. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది బావ! అని ట్వీట్ చేసింది హారిక. ఈ ట్వీట్ చూసిన బాబి.. మరదలకు థ్యాంక్స్ తెలిపాడు.


Click it and Unblock the Notifications











