బాలీవుడ్‌లో డ్రగ్ దందా.. తెరపైకి హీరో, డైరెక్టర్, ఇద్దరు పొలిటిషియన్స్‌ పేర్లు

బాలీవుడ్‌తో డ్రగ్ మాఫియాకు ఉన్న సంబంధాలపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కొరడా ఝులింపించేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే రియా చక్రవర్తిపై కేసు నమోదు చేసిన అధికారులు మరో ఇద్దరు డ్రగ్స్ సప్లయిదార్లను అదుపులోకి తీసుకొన్నారు. బాలీవుడ్‌లోని నలుగురు ప్రముఖులకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయనే వార్తల నేపథ్యంలో ఇద్దరు డ్రగ్ సప్లయిదార్లను అరెస్ట్ చేయడం సెన్సేషన్‌గా మారింది.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్సీబీ దాదాపు 18 మందితో కూడిన జాబితాను ముంబై పోలీసులకు అందజేసింది. అదుపులోకి తీసుకొన్న ఇద్దరి వివరాలను మీడియాకు వివరించారు. మరో 72 గంటల్లో ఇద్దరితోపాటు 18 మందిని ప్రశ్నిస్తామని ఎన్సీబీ అధికారులు పేర్కొన్నారు. డ్రగ్ మాఫియాతో నలుగురు ప్రముఖులకు సంబంధాలున్నాయనే ఆరోపణ నేపథ్యంలో ఇద్దరు రాజకీయ నేతలు, ఓ హీరో, మరో దర్శకుడికి సంబంధాలు ఉన్నాయనే విషయం ఎన్సీబీ దృష్టికి వచ్చింది.

Drug Angle in Sushant case: Hero, Director and Two politicians under lens

ఇక సుశాంత్ మరణం కేసులో రియా చక్రవర్తిని ఐదోసారి విచారించారు. రియానే కాకుండా రియా తల్లిదండ్రలను కూడా విచారణకు పిలిచారు. మంగళవారం రోజున గోవా హోటల్ యజమాని గౌరవ్ ఆర్యను మరోసారి విచారించడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X